ఏపీ : కౌంటింగ్ ఏజెంట్లకు దిశా నిర్దేశం చేసిన చంద్రబాబు..!!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. మే 13న ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరిగింది అయితే దానికి సంబంధించి కౌంటింగ్ కు కూడా సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ప్రధాని మోడీ నామినేషన్ వేసిన రోజు మాత్రమే వారణాసిలో చంద్రబాబు మీడియా తో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు మూడు రోజుల క్రితమే హైదరాబాద్‎కు వచ్చారు. ఆ తర్వాత శనివారం రాత్రి ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.ఇక శనివారం సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాలలో జాతీయ సంస్థలు టీడీపీ కూటమికి పట్టం కట్టాయి. ఈ నేపథ్యంలోనే కూటమి అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని అభిప్రాయపడిన చంద్రబాబు.. విజయం కోసం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు మంచి సమన్వయంతో పనిచేశారని అన్నారు.కౌంటింగ్ రోజు కూడా అనేక అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశం ఉంది. కూటమి ఏజెంట్లు. అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి. కౌంటింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలి. అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ ఏజెంట్లు పని చేయాలని సూచించారు చంద్రబాబు.కౌంటింగ్ రోజున వైసీపీ విద్వేశాలు రెచ్చగొట్టే అవకాశం ఉందని, ఇప్పటికే ఆ పార్టీ అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్ చేస్తోందని అన్నారు. ప్రతి నియోజవర్గ పరిధిలో కూటమి నేతలు తమ నాయకులు కార్యకర్తలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో జగన్ తిరకాసు పెట్టేందుకు ప్రయత్నించాడని ఆరోపిచంచారు. అందుకే, ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని, విజయం సాధించిన తరువాత డిక్లరేషన్ ఫాం తీసుకున్నాకే అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి రావాలని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: