పుష్ప 2: పీకే ఫ్యాన్స్ దాడికి పోయేలా ఉందిగా?

Purushottham Vinay
 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన సినిమా విషయంలో ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ కూడా తెలియదు. ఎందుకంటే ఎంత లేట్ అయినా పర్లేదు కానీ తన సినిమా అవుట్ ఫుట్ విషయంలో సుకుమార్ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడు.బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చే దాకా సుకుమార్ ట్రై చేస్తూనే ఉంటాడు. దానికోసం ఆయన సినిమాల రిలీజ్ డేట్లు కూడా వాయిదా పడ్డ రోజులున్నాయి. ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ 2 సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది.గత సంవత్సరం చివర్లోనే రిలీజ్ కావాల్సిన ‘పుష్ప 2’  షూటింగ్ ఆలస్యం వల్ల ఆగస్టు 15 కి వాయిదా పడింది. ఇంకా రిలీజ్ టైం దగ్గర పడుతున్నా ఇంకా షూటింగ్ కంప్లీట్ కాకపోవడం బన్నీ ఫ్యాన్స్ లో పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇలాంటి తరుణంలో సుకుమార్ ఇప్పుడు మరో ఊహించని ట్విస్ట్ ని ఇచ్చాడు. ‘పుష్ప 2’ క్లైమాక్స్ ని మార్చాలని సుకుమార్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాని సమాచారం తెలుస్తుంది.


మాములుగా సుకుమార్ తన సినిమాలకి రెండు క్లైమాక్స్ లు ఖచ్చితంగా రాసుకుంటాడు. ‘పుష్ప 2’ సినిమా కోసం కూడా రెండు క్లైమాక్స్ లు ప్లాన్ చేశాడట. రెండిటిలో ఒకటి యాడ్ చేయాలని భావించగా.. ముందుగా అనుకున్న క్లైమాక్స్ కాకుండా వేరే క్లైమాక్స్ యాడ్ చేసే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. పైగా ఈమధ్య ఎన్నికల ముందు బన్నీ వైసీపీకి సపోర్ట్ చెయ్యడం పవన్ కళ్యాణ్ అభిమానులకి ఏమాత్రం నచ్చలేదు. అందుకే వారు సినిమాని బ్యాడ్ చేస్తున్నారు. పైగా ఇప్పటిదాకా విడుదల అయిన రెండు పాటలు కూడా సాధారణంగా ఉన్నాయి. పుష్ప రేంజ్ లో లేవు.పైగా తెలుగులో పవన్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఈ సినిమా చూడమని నెగటివ్ చేస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు. అందువల్ల తెలుగులో వసూళ్లపై ఎఫెక్ట్ పడొచ్చు.అందుకే సుకుమార్ కనీసం నార్త్ ఆడియన్స్, కేరళ ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యేలా సినిమాని చెక్కుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: