శింగనమలలో టీడీపీ వైసీపీలకు కాంగ్రెస్ షాకివ్వనుందా.. శైలజానాథ్ కే అనుకూల పరిస్థితా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ పరిస్థితులు మాత్రం మారలేదు. అయితే శింగనమల నియోజకవర్గంలో టీడీపీ వైసీపీలకు కాంగ్రెస్ షాకివ్వనుందని పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ ప్రెసిడెంట్‌ శైలజానాథ్ కు ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది.
 
వైసీపీ, కూటమి అభ్యర్థులతో పోల్చి చూస్తే శైలజానాథ్ కే ఓటర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో గతంతో పోల్చి చూస్తే కొంతమేర బలం పెరిగింది. అనుభవం ఉన్న రాజకీయ నాయకులు ఈ పార్టీ తరపున పోటీ చేస్తుండటం ఈ పార్టీకి కలిసొస్తుండటం గమనార్హం. శింగనమల లో మాత్రం త్రిముఖ పోరు నెలకొందని పొలిటికల్ వర్గాల టాక్.
 
ఈ నియోజకవర్గంలో శైలజానాథ్ ఎమ్మెల్యేగా గెలిచినా ఏ మాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొన్ని సర్వేలలో సైతం శింగనమలలో కాంగ్రెస్ సత్తా చాటుతుందని వెల్లడవుతోంది. కూటమి, వైసీపీ అభ్యర్థుల మైనస్ లే శైలజానాథ్ కు ప్లస్ అవుతున్నాయని తెలుస్తోంది. శైలజానాథ్ రూపంలో కాంగ్రెస్ ఇతర పార్టీలకు గట్టి షాక్ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
 
ఈ ఎన్నికల్లో ప్రజలు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నియోజకవర్గాల్లో శింగనమల ఒకటి కాగా ఏం జరగనుందో చూడాల్సి ఉంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిస్తే మాత్రం సంచలనం అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. దాదాపుగా పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. వైసీపీ, టీడీపీ అభ్యర్థుల విషయంలో చేసిన పొరపాట్లు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు కలిసొస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: