మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు నురుగు వస్తోందా..ఎంత ప్రమాదమో తెలుసా..?
నురుగు రావడం వల్ల మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే మూత్రంలో నురుగు కనిపిస్తుందట.. నిజానికి మూత్రపిండాల సంబంధించి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే మురుగుతో కూడిన మూత్రం కూడా రావడానికి కారణమవుతుందట.
అధిక చక్కెర మధుమేహ రోగులకు మూత్రంలో నురుగు కనిపిస్తుందట రక్తంలో చక్కెర స్థాయి ఎప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడే నురుగు ఏర్పడుతుందట. మూత్రం మురుగు ఎక్కువగా వస్తూ ఉంటే ఎలాంటి వైద్య పరీక్షలు చేయించాలి..
మూత్రంలో గ్లూకోస్ ప్రోటీన్ వంటి వాటిపైన తనిఖీ చేయించాల్సి ఉంటుంది. వీటికి తోడు మూత్రపిండాల పనితీరు చెక్ చేయించుకోవాలి. అలాగే మూత్రంలో ఎంత మోతాదులో ప్రోటీన్ ఉందని విషయాన్ని కూడా చెక్ చేయించుకోవడం మంచిది.
మూత్రంలో నురుగు తో పాటు ముదురు పసుపు లేదా ఎరుపు రంగులో మూత్ర విసర్జన రావటం మంట నొప్పి లేదా మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు అసౌకర్యంగా అనిపించడం జరిగినప్పుడు వైద్యుల్ని సంప్రదించడం చాలా ముఖ్యము.
అయితే కొన్ని సందర్భాలలో మనం తినే ఆహారం వల్ల కూడా కొన్నిసార్లు యూరిన్లో మార్పులు సంభవిస్తూ ఉంటాయి.. వాటిని గుర్తించి పదే పదే యూరిన్ సమస్యలు ఏర్పడితే వైద్యుని సంప్రదించడం ఉత్తమం.
ఇలాంటి సమస్యలు ఎదురు కాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు ఎక్కువగా నీటిని తాగడం ఉత్తమమని నిపుణులు వెల్లడిస్తున్నారు.