దెయ్యల సినిమా డైరెక్టర్ తో విశ్వక్ మూవీ?
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలుగా పరిచయం అవుతున్నారు. అందులో కొంతమంది హీరోలు మాత్రమే అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంటారు. అలాంటి వారిలో యంగ్ హీరో విశ్వక్సేన్ ఒకరు. ఈ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 2017 సంవత్సరంలో మొదటిసారిగా వెళ్లిపోమాకే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
అనంతరం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ హీరో నటించిన తాజా చిత్రం "లైలా". ఈ సినిమాలో విశ్వక్సేన్ డిఫరెంట్ రోల్ పోషించారు. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రోజున కాస్త గొడవ చెలరేగిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు విశ్వక్సేన్ పైన విపరీతంగా మండిపడ్డారు.
అలాంటి రోల్ చేయడం అవసరమా అని ప్రశ్నించారు. అయితే వాటిపై విశ్వక్సేన్ స్వయంగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఇలాంటి సినిమాలు ఇంకెప్పుడు చేయనని అన్నాడు. అయితే ఈ సినిమా ఓటిటి రిలీ జ్ కు రెడీగా ఉంది. ఇదిలా ఉండగా.... విశ్వక్సేన్ మరోవైపు "ఫంకీ" అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. లైలా సినిమా అనంతరం విశ్వక్సేన్ తాను చేయబోయే సినిమాల కథ ఎంపిక విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
విశ్వక్సేన్ ఫంకీ సినిమా అనంతరం మసూద డైరెక్టర్ సాయికిరణ్ తో కలిసి ఓ సినిమాను చేయబోతున్నారట. ఈ సినిమా కథను విశ్వక్సేన్ కి డైరెక్టర్ సాయికిరణ్ చెప్పడంతో ఆ స్టోరీ నచ్చి వెంటనే విశ్వక్సేన్ సినిమాకు ఓకే చెప్పారట. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించనున్నారట.