ఏపీ: మీకన్నా జగనే మేలు.. జేసీ నోట ఈ మాట..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కొంతమంది నేతలు ఎలా మాట్లాడినా కూడా సంచలనంగానే ఉంటాయి.. అలాంటి వారిలో జెసి ప్రభాకర్ రెడ్డి కూడా ఒకరు. టిడిపి పార్టీకి చెందిన జెసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన హవా చూపిస్తున్నారు.. ముఖ్యంగా ఎలాంటి విషయాలను కూడా లెక్కచేయకుండా చెప్పేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు జెసి ప్రభాకర్ రెడ్డి బస్సులు దగ్గమైన విషయం వైరల్ గా మారుతోంది. అయితే ఈ విషయం పైన జెసి ప్రభాకర్ రెడ్డి ఒక సంచలనం వీడియోని రిలీజ్ చేయడం జరిగింది.

అయితే ఈ వీడియోలో ఏకంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొగడడం జరిగింది. ఇక వీడియోలో విషయానికి వెళ్తే.. బస్సులు కాల్చారు ఏమైంది నేను అసలు కంప్లైంట్ కూడా చేయను.. ఏం చేస్తారు.. మీ కన్నా జగన్ రెడ్డి మేలు కదరా.. బిజెపి వాళ్ళ లాగా ఎప్పుడు కూడా జగన్ నా బస్సులను సైతం తగలబెట్టలేదని.. కేవలం నా బస్సులను మాత్రమే ఆపాడు అంతే అంటూ తెలియజేశారు. ఈ విషయం చాలామంది నేతలను సైతం ఆశ్చర్యపరిచేలా ఉన్నది. కానీ మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులను తగలబెట్టించారు అంటు ఫైర్ అయ్యారు.

అంతేకాకుండా 300 పోతేనే ఆరోజు ఏడ్చలేదు.. వీటికి ఏడుస్తానా.. కాల్చి ఏం చేశారంటూ కూడా ఫైరయ్యారు ప్రభాకర్ రెడ్డి.. జగన్ రెడ్డి మేలు కదరా మంచోడు.. నిలబెట్టించినాడు .. ఆరోజు పది లక్షలకు పోతే ఈరోజు ఆరు లక్షలకు పోయేది.. కానీ మీరు ఇంత నీచనికి దిగిపోయారు అంటూ ఫైర్ అయ్యారు.. అయినా కూడా తాను భయపడనని ఇంకా బస్సులు లైన్లో అక్కడే పెట్టాను కాల్చుకుంటారేమో కాల్చుకోపోండి  అంటు వీడియోలో తెలిపారు జెసి ప్రభాకర్ రెడ్డి. కానీ మీరు మా డ్రైవర్ల జీవితాలను నాశనం చేశారంటూ ఫైర్ అయ్యారు. మొత్తానికి ఈ వీడియోలో ఎన్నో విషయాలను తెలిపారు ప్రభాకర్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: