గేమ్ ఛేంజర్ సాంగ్స్ వెనుక ఉన్న కథలెంటో తెలుసా..?
ట్రైలర్లో కూడా విజువల్స్ భారీగానే హైలెట్ చేసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా పాటలకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. సుమారుగా రూ .75 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గేమ్ ఛేంజర్ ఒక్కో పాటకి ఒక్కో ప్రాధాన్యత ఉన్నదట.
గేమ్ ఛేంజర్ నుంచి వచ్చిన తర్వాత వచ్చిన మొదటి పాట జరగండి జరగండి.. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్ అందించగా సుమారుగా 600 మంది డాన్సర్లు పాల్గొన్నారు. అలాగే 13 రోజులపాటు ఈ పాట కోసం షూటింగ్ చేశారట. అలాగే 70 అడుగుల ఎత్తైన కొండ విలేజ్ సెట్ అందుకు తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ కూడా జనపనారతో తయారు చేయడం గమనార్హం.
రామ్ మచ్చా సాంగ్.. గణేష్ ఆచార్య కొరియోగ్రాఫర్ చేయగా ఈ పాటకి 1000 మంది జానపద కళాకారులు డాన్స్ చేశారట. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలోని నృత్య రితులు ఇందులో కనిపిస్తాయట.
నానా హైరానా.. పాట కోసం మొదటిసారి ఇన్ఫ్రా రెడ్ కెమెరాతో తీసిన మొట్టమొదటి సాంగ్ ఇదేనట. న్యూజిలాండ్ అందమైన లొకేషన్స్ ఈ పాటని సైతం షూట్ చేశారట. ఈ పాటకి మనీష్ మల్హోత్ర కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేయడంతో పాటు ఆరు రోజులు షూటింగ్ చేశారట.
దోప్ సాంగ్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ పాట కోవిడ్ సెకండ్ వేవ్ చిత్రీకరించారట. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ చేయక రష్యా నుంచి 100 మంది ప్రొఫెసర్ డాన్సర్లు ఇందుకోసం ప్రత్యేకమైన విమానంలో తీసుకోవచ్చారు.. సుమారుగా 8 రోజులపాటు ఈ సినిమా షూటింగ్ని చిత్రీకరించారట.
అయితే కేవలం నాలుగు పాటలను మాత్రమే విడుదల చేయగా ఐదో పాటని వెండితెర పైన స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నారట ఈ పాటను చూసి ప్రేక్షకులు కూడా అవుతారట.