డాకు మ‌హ‌రాజ్ నుండి ద‌బిడి దిబిడి వ‌చ్చేసింది.. ఇక‌ యూట్యూబ్ షేక్ అవ్వాల్సిందే

MADDIBOINA AJAY KUMAR
స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్. బాబి కొల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ ప్రొడ్యూసర్ నాగ వంశీ నిర్మిస్తున్నారు . భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో బాలయ్యకు జోడిగా ప్ర‌గ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ నటించారు. అంతేకాకుండా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా సైతం ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేశారు. తాజాగా బాలయ్య ఊర్వశి కలిసి స్టెప్పులు వేసిన స్పెషల్ సాంగ్ ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు సమకూర్చగా దబిడి పాటను సింగర్ వాగ్దేవితో కలిసి ఆయనే పాడారు . 

ప్రముఖ రచయిత కాసర్ల శ్యామ్ ఈ పాటకు లిరిక్స్ అందించారు. ఉలాల ఊలాల అని మొదలయ్యే ఈ పాట లిరిక్స్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక బాలయ్య బాబు ఊర్వ‌శితో వేసిన స్టెప్పులు ఆడియన్స్ తో స్టెప్పులు వేయిస్తున్నాయి. అటు రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ తో మెగా అభిమానులకు ట్రీట్ ఇస్తే బాలయ్య తన అభిమానుల‌కు ద‌బిడి ద‌బిడి పాటతో నందమూరి అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. గతంలో బాలయ్య పైసా వసూల్ పాటతో యూట్యూబ్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే .

ఇక ఈ పాటతో కూడా మ‌రోసారి బాలయ్య యూట్యూబ్ ను షేక్ చేయబోతున్నాడ‌ని అర్థం అవుతోంది. పాటలో ఊర్వశి అందాలు అదరహో అనే విధంగా ఉండటం మరో హైలెట్. అంతే కాకుండా బాల‌య్య ఊర్వ‌శి బ్లాక్ దుస్తుల‌తో ఎంతో స్టైలిష్ లుక్ తో క‌నిపించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ఈనెల 12న విడుదల చేయబోతున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న‌ ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: