ఒక్కడు, పోకిరి రెండు కలిపితే గేమ్ చేంజర్?
ఇక ఈ సినిమాలో... రామ్ చరణ్ యాక్టింగ్ అదరగొట్టాడని స్పష్టం చేశారు. బాక్సులు బద్దలు కావడం గ్యారెంటీ అన్నారు. AR కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ అన్నప్పుడు నాకు టెన్షన్... వచ్చిందని దర్శకుడు... శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ రామ్ చరణ్ హీరోగా చేసిన గేమ్ చేంజర్ సినిమాకు...థమన్ ఇచ్చిన మ్యూజిక్ చూసి హ్యాపీ అనిపించిందని కొనియాడారు. థమన్ ఇచ్చిన BGM గేమ్ చేంజర్ సినిమా ఇంకా చాలా బాగుంది చూడటానికి అంటూ పేర్కొన్నారు.
జనవరి పదవ తేదీన సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని.... ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని వెల్లడించారు దర్శకుడు శంకర్. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా చేయడం జరిగింది. అయితే ఇందులో అంజలి కూడా కీలక పాత్రలో కనిపించారు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తుంటే ఇద్దరు రామ్ చరణ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకరేమో.. మాస్ యాంగిల్ లో ఉన్నట్లు... మరొక రాంచరణ్ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒక రాజకీయ నాయకుడు, ఒక ఐఏఎస్ అధికారి మధ్య కథగా కనిపిస్తోంది. ఇక విలన్ పాత్రలో ఎస్ జె సూర్య... మరోసారి తన మార్కు చూపించినట్లు స్పష్టమవుతోంది. ఇది ఇలా ఉండగా గేమ్ చేంజర్ సినిమా దాదాపు 450 కోట్లతో తెరకెక్కింది. ఈ సినిమా జనవరి 10వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.