ఏపీ డీబీటీ లబ్ధిదారులతో టీడీపీ చెలగాటం.. నగదు జమ కాకపోవడానికి కారణాలివే!

Reddy P Rajasekhar
ఏదో సామెత చెప్పినట్టు ఏపీలో పేదల ఖాతాలలో సంక్షేమ పథకాల నగదు జమ చేయడానికి కోర్టు నుంచి అనుమతులు లభించినా వైసీపీకి నగదు జమ చేయడం విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తమకు ఫిర్యాదులు రావడం వల్లే పథకాలను నిలిపివేశామని ఇప్పటికే ఈసీ వెల్లడించగా తెలుగుదేశం నేతల ఫిర్యాదుల వల్లే ఈ నగదు జమ కాలేదని ఈసీ క్లారిటీతో వైసీపీ నేతలకు, డీబీటీ లబ్ధిదారులకు అసలు విషయం అర్థమైంది.
 
ఏపీలో హైకోర్టు ఉత్తర్వులు అమలు కాకుండా టీడీపీ ఈసీపై ఒత్తిళ్లు తెస్తోందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఖాతాలలో నగదు జమ చేయవచ్చని హైకోర్టు తీర్పు ఉత్తర్వులు వెలువడినా ఈసీ అధికారుల నుంచి ఇంకా క్లారిఫికేషన్ రాలేదు. ఇంతకాలం నగదు ఎందుకు జమ చేయలేదని ఎన్నికల కమిషన్ ప్రశ్నిస్తుండగా 2019 ఎన్నికలకు వారం ముందు పసుపు కుంకుమ నగదు జమ చేస్తే ఎందుకు ఆక్షేపించలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
ఏపీ ప్రజలకు పథకాల నగదు అందకుండా బాబు కుట్ర చేస్తున్నారని ఓటర్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈసీ క్లారిఫికేషన్ ఆలస్యమైతే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిపోతోందని లబ్ధిదారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. మరోవైపు హైకోర్టు డీబీటీ లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ విషయంలో నవతరం పార్టీ తరఫున పరోక్షంగా కోర్టులో అప్పీల్ కు వెళ్లిందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
ఇప్పటికే పింఛన్ల విషయంలో వృద్ధులు ఇబ్బందులు పడటానికి కారణమైన టీడీపీ పథకాల నగదు సకాలంలో జమ కాకుండా చేయడం వల్ల మహిళలు, రైతులు, విద్యార్థులకు శత్రువు అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ఓటర్లు కూటమికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని ఈసీని అడ్డు పెట్టుకుని పేదల జీవితాలతో కూటమి ఆడుకుంటోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలో మాత్రమే పేదల విషయంలో ఆంక్షలు అమలవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. పేదలపై కక్ష తీర్చుకునేలా టీడీపీ తీరు ఉందని విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: