ఏపీ పొలిటిక‌ల్ తెర‌పై ' యాద‌వ శ‌కం ' ఆరంభం..!

RAMAKRISHNA S.S.
- కమ్మ‌, రెడ్డి, కాపు రాజ‌కీయాలే కాదు ఇక యాద‌వ రాజ‌కీయాలూ..!
- గ‌తం కంటే భిన్నంగా వైసీపీ, టీడీపీ కూట‌మి నుంచి ఎక్కువ మందికి సీట్లు
- అగ్ర కుల సంప్ర‌దాయ సీట్లూ ఈ సారి యాద‌వుల‌కే..!
- ఏలూరు పార్లమెంటులో టీడీపీ యాద‌వ్ Vs వైసీపీ యాద‌వ్
- 2024లో తెర‌పైకి కొత్త‌గా గోరుముచ్చు గోపాల్ యాద‌వ్ ఆరంగ్రేటం
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఏపీ రాజ‌కీయాలు అంటేనే కుల రాజ‌కీయాలు.. ఏపీలో రాజ‌కీయాలు అన్నీ కులాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. క‌మ్మ‌, కాపు, రెడ్డి రాజ‌కీయాల‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో వెల‌మ‌, క్ష‌త్రియ రాజ‌కీయ ఆధిప‌త్యం కూడా చూస్తూ ఉంటాం. అయితే గ‌తంలో సంగ‌తి ఎలా ఉన్నా 2024 ఏపీ పొలిటిక‌ల్ తెర‌పైకి కొత్త‌గా యాద‌వ రాజ‌కీయ శకం ఆరంభ‌మైంది. యాద‌వ సామాజిక వ‌ర్గం ఓట్లు ఏపీలో 7 % కు కాస్త అటూ ఇటూగా ఉంటాయ‌ని అంచ‌నా. అయితే కొన్ని కులాల్లా వీరు ఒకే ప్రాంతంలో కాకుండా అన్ని ప్రాంతాల్లోనూ బ‌లంగా ఉన్నారు.

బీసీల్లో చాలా కులాలు ఉన్నా కూడా .. బీసీల్లో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంగా యాద‌వ కులం గుర్తింపు తెచ్చుకుంది. రాజ‌కీయంగా 7 % అంటే ఖచ్చితంగా వీరు ఒకే మాట మీద ఉంటే రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటులో వీరు డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్ అవుతారు అన‌డంలో సందేహం లేదు. టీడీపీ గ‌తం నుంచి యాద‌వుల‌కు గుర్తింపు ఇస్తే.. ఇప్పుడు సీఎం జ‌గ‌న్ కూడా ఈ కులానికి విప‌రీత‌మైన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకే ఈ సారి ప‌లు కీల‌క స్థానాల‌ను కూడా రెండు పార్టీలు ఈ సామాజిక వ‌ర్గానికి కేటాయించాయి.

అగ్ర వ‌ర్ణాల‌కు సాంప్ర‌దాయ సీటుగా ఉండే ఏలూరు పార్ల‌మెంటులో ఈ సారి రెండు పార్టీల నుంచి ఇద్ద‌రు యాద‌వ యంగ్‌స్ట‌ర్స్ పోటీ ప‌డుతున్నారు. ఇక వైసీపీ న‌ర‌సారావుపేట‌, ఏలూరు పార్ల‌మెంటు సీట్లు వీళ్ల‌కు ఇస్తే టీడీపీ కూట‌మి ఏలూరు పార్ల‌మెంటు సీటు ఇచ్చింది. ఈ ఎన్నిక‌ల్లో యాద‌వ యంగ్‌స్ట‌ర్స్‌కు తెలుగు రాజ‌కీయాల‌కు పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌, ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గోరుముచ్చు గోపాల్ యాద‌వ్ ప‌రిచ‌యం అయ్యారు. పుట్టాకు బ‌ల‌మైన పొలిటిక‌ల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఇక గోరుముచ్చు స్వ‌యంశ‌క్తితో ఎదిగారు. ఆయ‌న‌కు ముందు ఏలూరు పార్లమెంట్ టిక్కెట్ టీడీపీ ఇస్తుంద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అక్క‌డ సీటు రాక ఆయ‌న వైసీపీలోకి వెళ్లిన వారం రోజుల‌కే పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయ్యి దూసుకుపోతున్నారు.

ఇక యాద‌వ కులానికి వైసీపీ రెండు పార్ల‌మెంటు, 4 అసెంబ్లీ మొత్తం 6 సీట్లు కేటాయించింది. కూట‌మి ఒక ఎంపీతో పాటు 8 అసెంబ్లీ సీట్లు... మొత్తం 9 సీట్లు కేటాయించింది. ఏదేమైనా యాద‌వులు ఈ ఎన్నిక‌ల్లో త‌మ‌కు అందివ‌చ్చిన అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకుని మెజార్టీ సీట్ల‌లో విజ‌యం సాధిస్తే వ‌చ్చే ద‌శాబ్దాల‌లో ఏపీ రాజ‌కీయాల్లో వీరు కీ రోల్ ప్లే చేస్తార‌న‌డంలో సందేహం లేదు.
యాద‌వ క‌మ్యూనిటీ నుంచి వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తోన్న అభ్య‌ర్థుల వివ‌రాలు ఇలా ఉన్నాయి..

యాద‌వ సామాజిక వ‌ర్గం - వైసీపీ అభ్య‌ర్థులు
పార్ల‌మెంటు అభ్య‌ర్థులు :
1) న‌ర‌సారావుపేట :  పోలుబోయిన అనిల్‌కుమార్ యాద‌వ్
2) ఏలూరు:  కారుమూరి సునీల్ కుమార్ యాద‌వ్‌

అసెంబ్లీ అభ్య‌ర్థులు :
3) త‌ణుకు: కారుమూరి నాగేశ్వ‌ర‌రావు
4) మైల‌వ‌రం: స‌ర్నాల తిరుప‌తిరావు యాద‌వ్‌
5) క‌నిగిరి: ద‌ద్దాల నారాయ‌ణ‌రావు యాద‌వ్‌
6) కందుకూరు: బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్‌
..........................................................................................
యాద‌వ సామాజిక వ‌ర్గం - కూట‌మి అభ్య‌ర్థులు
పార్ల‌మెంటు అభ్య‌ర్థులు :
1) ఏలూరు: పుట్టా మ‌హేష్‌కుమార్ యాద‌వ్‌

అసెంబ్లీ అభ్య‌ర్థులు :
2) గాజువాక‌: ప‌ల్లా శ్రీనివాస‌రావు
3) విశాఖ ద‌క్షిణం: పి. వంశీకృష్ణ శ్రీనివాస్‌
4) తుని: య‌న‌మ‌ల దివ్య‌
5) నూజివీడు: కొలుసు పార్థ‌సార‌థి
6) చీరాల‌: ఎంఎం. కొండ‌య్య యాద‌వ్‌
7) ధ‌ర్మ‌వ‌రం: స‌త్య‌కుమార్ యాద‌వ్‌
8) మైదుకూరు:  పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: