జగన్ :గెలిపించేది వాళ్లే.. అందుకే అంత ధీమా..!

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరొక కొద్ది రోజులలో జరగబోతున్న తరుణంలో రసవత్తంగా మారుతున్నాయి. మరోసారి అధికార లక్ష్యంగా వైసిపి పార్టీ అడుగులు వేస్తున్నారు.  జగన్ను ఓడించడానికి సైతం చంద్రబాబు పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీలతో ఏకమయ్యారు. ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడితే కచ్చితంగా గెలుస్తామని నమ్మకం వేసుకున్నారు.. పోలింగ్ కి మరో ఏడు రోజుల సమయం ఉన్నందువల్ల ఎన్నికల ప్రచారాన్ని చాలా జోరుగానే చేస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ కూడా తమ మేనిఫెస్టోను విడుదల చేసి తమకు సాధ్యమయ్యే హామీలను సైతం చేస్తున్నారు.

అయితే వైసిపి పార్టీ గత ఎన్నికలలో నవరత్నాలనే తిరిగి అమలు చేస్తామని అయితే ఇందులో కొన్నిటిని మాత్రమే పెంచినట్లుగా ఆ పార్టీ ప్రకటించింది.. అయితే కూటమి నుంచి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు అయితే ఇది బిజెపికి సంబంధం లేదని తెలియజేసింది.కేవలం టిడిపి, జనసేన పార్టీలు మాత్రమే సూపర్ సిక్స్ పేరుట ఒక మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. ఇరు పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత ఒక్కసారిగా గ్రౌండ్ రిపోర్టు సైతం మారిపోయింది. ఇటీవలే ఒక ప్రముఖ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురుషులు టిడిపి కూటమి వైపుగా ఎక్కువ మక్కువ చూపుతున్నారని మహిళలు మాత్రం ఏకపక్షంగా వైసిపి పార్టీ తరఫున మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా 50.18 శాతం మంది కూటమి వైపు ఉన్నారని వైసీపీ విషయానికి వస్తే..46.5 శాతం మంది మాత్రమే మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. మహిళల విషయానికి వస్తే 57% వరకు వైసిపి మగ్గుచూపుతున్నారని కూటమికి 40 శాతం మంది మాత్రమే మద్దతు తెలుపుతూ ఉండడం గమనార్హం. అంటే దాదాపుగా 17% వరకు మహిళలు వైసిపి వైపే ఉన్నారు.

ముఖ్యంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేయడమే ఇందుకు ముఖ్య కారణమని అవి కూడా మహిళల పేరుతో మంజూరు చేయడంతో మరింత కలిసి వస్తోంది. అయితే చంద్రబాబు కూడా ఇటీవలే మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు పెట్టిన అవి అమలయ్యే సాధ్యం కాదనే విధంగా ప్రజలు మాట్లాడు. ముఖ్యంగా మహిళా పథకాలే ఈసారి జగన్ను గెలిపిస్తాయని అందుకే అంత ధీమాతో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో పూర్తిగా తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: