వైసీపీ Vs టీడీపీ: గెలుపుని డిసైడ్ చేసేది ఆ ఓట్లేనా?

Purushottham Vinay
ప్రస్తుతం ఏపీలో సౌండ్ ఓట్లు ఎన్ని సైలెంట్ ఓట్లు ఎన్ని అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. పోలింగ్ కి ముందూ తరువాత కూడా సౌండ్ చేస్తున్న ఓట్లన్నీ కూడా వైసీపీ వ్యతిరేక ఓటేనని అంటున్నారు.ఆ ఓట్లను చూసి అధికారంలో ఉన్న వైసీపీ ఖచ్చితంగా ఓడిపోతుంది అనుకుంటే పెద్ద పొరపాటు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి కొన్ని సెక్షన్లలో అధిక శాతం వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఆ పార్టీ కూడా అంగీకరిస్తోంది. వీరంతా కూడా అర్బన్ లో ఉంటారని వీరి మీద రకరకాలైన ప్రభావాలు అధికం అని తెలుస్తుంది.ఇక అర్బన్ ఓటర్లలోనే ఉద్యోగులు విద్యావంతులు నిరుద్యోగులు సహా కీలక వర్గాలు అన్నీ ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. పైగా వీరిలో ఎక్కువ భాగం ఓట్లు కూటమికే పడతాయని కూడా అంగీకరిస్తున్నారు. అయితే వైసీపీకి ఉన్న నమ్మకం అంతా కూడా రూరల్ ఓటింగ్ మీదనే. వీరంతా కూడా గొంతు లేని వారు సైలెంట్ ఓటర్లు అని తెలుస్తుంది. వీరిని ఏ మీడియా పరిగణనలోకి తీసుకోదని తెలుస్తుంది.కానీ వారే ఎవరి రాజకీయ జాతకాన్ని అయినా కీలకమైన మలుపు తిప్పగలిగే సత్తా గలిగిన వారు అని ఇప్పుడు తెలుస్తుంది.


ఆంధ్రప్రదేశ్ లో మొత్తం నాలుగు కోట్ల 14 లక్షలకు పైగా ఓటర్లు ఉంటే ఇందులో అత్యధిక శాతం మూడు కోట్లకు పైగా పల్లె జనాలే ఉన్నారని వైసీపీ లెక్క చెబుతోంది. ఇంకా అలాగే మహిళా ఓటర్లు కూడా ఏపీలో ఎక్కువగా ఉన్నారు అని తెలుస్తుంది. ఆ ఓటింగ్ తమకి ఈసారి బాగా జరిగింది అని వైసీపీ గుర్తు చేస్తోంది.అయితే ఈ విషయాన్ని విస్మరించి తామే గెలుస్తామని కూటమి అంటోందని చెబుతున్నారు. మాట్లాడేవారు అంతా ఖచ్చితంగా వైసీపీ ఓటమి పాలు అవుతుందని అంటే దానిని మైండ్ గేం గా మారుస్తోంది టీడీపీ కూటమని అంటున్నారు. ఏది ఏమైనా తమకు పాజిటివ్ ఓటింగ్ ఈసారి జరిగిందని అది సైలెంట్ ఓటింగ్ అని వారు చెబుతున్నారు మాట్లాడని గొంతుకలే తమకు బలం బలగం అని అధికార వైసీపీ పూర్తి నమ్మకంగా ఉంది.మరి వైసీపీ నమ్మకం ప్రకారం సైలెంట్ ఓటింగే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా అధికారం తిరిగి తమ ఫ్యాన్ పార్టీ సొంతం అవుతుందని తెలుస్తుంది. మరి జూన్ 4 న ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: