గెలుపు కోసం తెలివైన ఎత్తుగడకి పాల్పడ్డ టీడీపీ..?

Purushottham Vinay
ఏపీలో మే 13న జరిగిన ఎన్నికల్లో  ఎవరిది పై చేయి అంటే నెమ్మదిగా వస్తున్న సమాచారం చూసినా అలాగే అధికారంలో ఉంటూ కూడా రీ పోలింగ్ కోసం డిమాండ్ చేస్తున్న వైసీపీ నేతల తీరు చూసినా కూడా టీడీపీదే గెలుపు అని తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో బాగా సక్సెస్ అయిందనే చెప్పాలి.అసలు బీజేపీని మిత్రునిగా చేసుకోవడం వెనక టీడీపీ వ్యూహామే ఇదీ అని తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ బలమైన పార్టీ. పైగా కేంద్రంలో అధికారంలో ఉంది. అంతేగాక ఖచ్చితంగా మరోసారి వస్తామన్న నమ్మకంతో ఉంది. దాంతో బీజేపీని కూటమిలోకి ఆహ్వానించి టీడీపీ చాలా తెలివైన ఎత్తుగడకే పాల్పడింది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఎన్నికల వేళ వ్యవస్థలను దగ్గరకు తీసుకుని పూర్తి సహకారం టీడీపీ పొందిందని దాని ఫలితమే వైసీపీకి గత కొన్ని ఎన్నికల నుంచి కంచుకోటలుగా ఉన్న సీట్లు ఈసారి డౌట్లో పడ్డాయని తెలుస్తుంది.


గురజాల, మాచర్లలలో అయితే ఆల్రెడీ టీడీపీకి గెలుపు ధీమా పెరిగింది. అంతే కాదు రాయలసీమ జిల్లాలలో కొన్ని కీలకమైన స్థానాల్లో కూడా గెలుపు అవకాశాలు మెరుగుపరచుకుందని తెలుస్తుంది.ఇక నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి అయితే జిల్లా కలెక్టర్ ఏకపక్షంగా కూటమిని సహకరించారు అని  అసలు విషయం కూడా చెప్పారు. అసలే నెల్లూరులో వైసీపీకి ఎన్నికల ముందు నుంచి రాజకీయంగా దెబ్బ మీద దెబ్బ గట్టిగా తగులుతోంది. ఇపుడు కాకాణి చెబుతున్న విషయం వింటే అక్కడ కూడా కూటమి ఎలక్షనీరింగ్ బ్రహ్మాండంగా ఉందనే తెలుస్తుంది.ఇక మరో వైపు సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన వైసీపీ మంత్రి అంబటి రాంబాబు రీపోలింగ్ కొన్ని చోట్ల కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా అలాగే మాచర్ల గురజాలలో కూడా రీ పోలింగ్ పెట్టించండి అని అడుగుతోంది అధికార పార్టీ వైసీపీ. సాధారణంగా అయితే విపక్షంలో ఉన్న పార్టీలు రీ పోలింగ్ కోరుతాయి. కానీ విచిత్రంగా అధికారంలో ఉన్న పార్టీ కోరుతోంది అంటే ఎలక్షనీరింగ్ లో ఎవరు గెలుస్తారు అన్నది తెలిసిపోతోంది.అంతే కాదు ఏపీలో చాలా నియోజకవర్గాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: