గాజువాక నియోజకవర్గంలో లెక్క మారుతోందా.. ఆ పార్టీకే అనుకూల ఫలితం రానుందా?

Reddy P Rajasekhar
 
ఉమ్మడి విశాఖ జిల్లాలోని గాజువాక నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే చర్చ ఓటర్ల మధ్య ఒకింత గట్టిగానే జరుగుతోంది. గాజువాక నియోజకవర్గం విషయంలో జగన్ అంచనాలే నిజం కానున్నాయని ఈ నియోజకవర్గంలో గుడివాడ అమర్నాథ్ విజయం సాధించవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పోల్ మేనేజ్మెంట్ తో వైసీపీ సులువుగా లక్ష్యాన్ని సాధించిందని ప్రచారం జరుగుతోంది.
 
గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గం కావడంతో ఓటర్లు సైతం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 35 సంవత్సరాల క్రితం ఈ నియోజకవర్గంలో తండ్రులు పోటీ చేసి వార్తల్లో నిలవగా ఈ ఎన్నికల్లో కొడుకులు పోటీ చేసిన నేపథ్యంలో గాజువాక నియోజకవర్గంలో గెలుపును అటు కూటమి ఇటు వైసీపీ ఒకింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
బలమైన సామాజిక వర్గాలకు చెందిన నేతలు పోటీ చేయడం, ఇద్దరు నేతలు గెలుపు కోసం ఖర్చు విషయంలో వెనుకడుగు వేయకపోవడం కూడా కచ్చితంగా ఇరు పార్టీలకు ప్లస్ అవుతోంది. అయితే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావడంతో ఈ నియోజకవర్గంలో ఉక్కు కార్మికులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని కూడా పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
ఈ నియోజకవర్గంలో మూడు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నా పోలింగ్ శాతం మాత్రం 70 శాతం మించకపోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది. ఇతర జిల్లాల ఓటర్లతో పోల్చి చూస్తే ఉమ్మడి విశాఖ ఓటర్లు ఒకింత బద్ధకించారని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది. గాజువాకలో వైసీపీ జెండా పాతితే మాత్రం సంచలనం అవుతుంది. ఈ నియోజకవర్గంలో ఫ్యాన్ గిరగిరా తిరుగుతుందో లేక ఫ్యాన్ రెక్కలు విరుగుతాయో చూడాల్సి ఉంది. ఎన్నికల ముందు గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యేగా గెలుస్తారని పెద్దగా అంచనాలు లేవు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం పరిస్థితి అంతకంతకూ మారిందని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: