ఏపీ: జగన్ పగ తీరడానికి ఇంకా మూడు రోజుల సమయం మిగిలి ఉందా..??

Suma Kallamadi
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబు హయాంలో జగన్ ని చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన్ని ప్రతిపక్ష నేతగా కూడా ఉండకుండా చేయాలని బాగానే ప్రయత్నం చేశారు. జగన్ అవన్నీ మనసులో పెట్టుకొని అధికారంలోకి వచ్చాక అతడిని ఎక్కడ తొక్కలో అక్కడి తోక్కేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక చేసిన రెండో పని ఏబీ వెంకటేశ్వరరావును విధుల నుంచి తొలగించడమే. తర్వాత రెండు అక్రమ కేసులతో ఆయనను పూర్తిగా పక్కన కూర్చోబెట్టేశారు. అక్రమ కేసుల్లో ఆయన ఇరుక్కుపోవడం, ఆ కేసుల విచారణ ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ లోనే ఉన్నారు. ఆయన సస్పెన్షన్ ఎత్తేసే వీలే లేదన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానంలో వాదనలు వినిపించింది.
 జగన్ వేసిన వేటు కారణంగా ఏబీ వెంకటేశ్వరరావు ఇకపై ఏ పదవులు చేపట్టకుండా రిటైర్ అయిపోతారేమో అనిపిస్తుంది. రిటైర్మెంట్ కి సంబంధించిన పిటిషన్ మూడు రోజుల్లో విచారణకు రానుంది. అందులో కోర్టు తీర్పు ఏమిస్తుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ కోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే జగన్ పగ తీరినట్లే. ప్రభుత్వంతో, వ్యవస్థలతో ఏవి వెంకటేశ్వరరావు చాలా పెద్ద పోరాటమే చేశారు ఆ ఒంటరి పోరాటంలో ఆయన నెగ్గుతారా లేదా అనేది కూడా మూడు రోజుల్లో తేలిపోతుంది. 2019 నుంచి జగన్ అయనకు చుక్కలు చూపించారు.
ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్, 1969లోని రూల్ 3(1) ప్రకారం వెంకటేశ్వరరావును ఫిబ్రవరి 2020లో రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఏరోస్టాట్, మానవరహిత వైమానిక వాహనాలను కొనుగోలు చేయడంలో అవకతవకలకు పాల్పడినందుకు అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అతను అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఇంటెలిజెన్స్)గా ఉన్నప్పుడు తీవ్రవాద వ్యతిరేక, భద్రతా కార్యకలాపాల కోసం ఆ వాహనాన్ని కొనుగోలు చేశారు. దాని కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగినట్లు వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తూ అతనిపై కేసు నమోదు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: