నేతలకు.. కార్యకర్తలకే కాదు.. వారికి కూడా ఫుల్ టెన్షన్..?

Pulgam Srinivas
కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు ముగిసాయి. ఇక ఎలక్షన్ల ముందు హోరా హోరీగా ప్రచారాలను చేసిన పార్టీలు ఎలక్షన్ల తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు. కాకపోతే ఎలక్షన్ల రోజు కొన్ని ప్రాంతాల్లో చెదురు మొదలు సంఘటనలు నెలకొన్నాయి. వాటి గురించి ఇప్పటికీ కూడా ప్రధాన పార్టీలు చర్చ చేస్తూనే ఉన్నాయి. ఇక 2014 కంటే ఎక్కువ శాతం ఓటింగ్ 2019 లో జరిగింది. దానిలో అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. వైసీపీ పార్టీకి అధికారం వచ్చింది. ఇక 2019 కంటే 2024 లో ఓటింగ్ శాతం ఎక్కువ నమోదు అయ్యింది.

దానితో ఈ సారి వైసీపీ అధికారాన్ని కోల్పోయి కూటమి అధికారం లోకి వస్తుంది అని అంచనాలను కూటమి నేతలు , కార్యకర్తలు , ప్రతి నిధులు వేస్తున్నారు. ఇలా అంచనాలు వేస్తున్న సమయం లోనే జగన్ పోయిన సారి కంటే మాకు ఈ సారి ఎక్కువ మెజారిటీ రాబోతుంది , మాకు పోయిన సారి 150 సీట్లు వస్తాయి అంటే ఎవరు నమ్మలేదు. కానీ అదే జరిగింది. అలాగే మాకు పోయిన సారి 22 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. ఇక ఈ సారి మాకు 150 కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు రాబోతున్నట్లు , 22 స్థానాల కంటే ఎక్కువ పార్లమెంటు స్థానాలు రానున్నట్లు ఒక ఈవెంట్ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

ఇలా చెప్పినప్పటికీ వైసీపీ పార్టీ అధినేత అయినటువంటి జగన్ కి , అతని పార్టీ కార్యకర్తలకు , నేతలకు కాస్త టెన్షన్ ఉన్నట్లే తెలుస్తుంది. ఇక జగన్ ఇలా బహిరంగంగా చెప్పడంతో కూటమి నేతలు కార్యకర్తలు కూడా టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తుంది. ఇలా వీరిద్దరితో పాటు జనాలు కూడా చాలా టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఎవరు అధికారం లోకి వస్తారు ..? ఇద్దరు ధీమాగానే ఉన్నారు. ఈ సారి ఓటింగ్ శాతం ఎక్కువ జరిగింది. దానితో నేతలు , కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఎవరు గెలుస్తారా అని టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: