సీనియర్ జర్నలిస్టుకు "చిరు" సాయం...అందుకే అతను మెగాస్టార్..!!

murali krishna
మెగాస్టార్.. ఈ బిరుదు ఊరికే రాలేదు. కొణిదెల శివ శంకర్ వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారడం పెద్దగా కష్టపడలేదు కానీ, చిరంజీవి అనే పేరును చరిత్ర గుర్తుపెట్టుకొనేలా చేయడం కోసం ఆయన కష్టపడ్డాడు. కేవలం వెండి తెరపై హీరోగానే కాదు.. సేవాకార్యక్రమాలతో కూడా కోట్లమంది హృదయాలను గెలుచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు మెగాస్టార్.ఇప్పుడు తాజాగా మరోసారి తన గొప్పమనసును చాటుకున్నారు చిరు. కష్టాల్లో ఉన్నానని తెలిస్తే చాలు సాయం చేసేందుకు ముందుకు వచ్చే వారిలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి. సినిమా ఇండస్ట్రీలోనే తన అభిమానులకు, పలువురు జర్నలిస్టులకు సాయం చేయడంలో ముందుంటారు చిరు.తాజాగా ఓ సీనియర్ సినిమా జర్నలిస్ట్‌కు అండగా నిలిచి తనలోని మంచి తనాన్ని బయటపెట్టారు.ఎన్నో అవమానాలు, అడ్డంకులు అన్ని దాటుకొని ఈ స్టేజికి వచ్చి నిలబడ్డాడు. ఇక సినిమాల విషయంలోనే కాదు. ఇండస్ట్రీని చల్లగా చూడడంలో కూడా మెగాస్టార్ లానే ఉన్నాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నా అని ఆపన్న హస్తం ఇవ్వడంలో చిరు తరువాతే ఎవరైనా.
చాలామంది చిరు సహాయం చేశాడని ఇంటర్వ్యూల్లో చెప్పడమే తప్ప .. ఈ సాయం చేశాను అని ఏరోజు చిరు చెప్పిన దాఖలాలు లేవు. ఇప్పటివరకు ప్రజలకు తెలిసినవి కొన్నే. తెలియకుండా చిరు చేసిన సాయాలు ఎన్నో. తాజాగా చిరు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక జర్నలిస్ట్ కు రూపాయి ఖర్చు కాకుండా చికిత్స చేయించి అందరి మన్ననలను అందుకుంటున్నాడు. ఇండస్ట్రీలో జర్నలిస్ట్ ప్రభు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 4 రోజుల క్రితం ఆయన అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది.గుండెలో 80% హొల్స్ బ్లాక్ అవ్వడంతో ప్రభుకు సీరియస్ అయ్యింది. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. సర్జరీ చేయాలనీ చెప్పారట. ఇక సెకండ్ ఒపీనియన్ కోసం చిరంజీవి కి ఫోన్ చేసి అడగ్గా.. ముందు ఆయన దైర్యం చెప్పి.. రమేష్ హాస్పిటల్స్ కు పంపించారట. ప్రస్తుతం ప్రభు ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నాడు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంఘం.. చిరంజీవికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక పోస్ట్ పెట్టింది.
” చిరంజీవి గారికి ఇవే మా కృతజ్ఞతలు.. సీనియర్ జర్నలిస్టు ప్రభు గారు నాలుగు రోజుల క్రితం జనరల్ మెడికల్ టెస్ట్ చేయించుకున్నప్పుడు హార్ట్ లో 80% బ్లాకులు ఉన్నట్టు గుర్తించారు. దీంతో వెంటనే యాంజియో గ్రామ్ చేసి బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారు. ఇక అప్పుడు ఏం చేయాలో తెలియక ప్రభు గారు సెకండ్ ఒపీనియన్ కోసం చిరంజీవి గారిని సంప్రదిస్తే ఆయన వెంటనే స్టార్ హాస్పిటల్ డాక్టర్స్ కి ఫోన్ చేసి అన్ని ఏర్పాట్లు చేయించి..అడ్మిట్ కూడా చేయించారు.. డాక్టర్స్ కి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ప్రభు గారి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. డాక్టర్ రమేష్ టీం క్షుణ్ణంగా పరిశీలించి బైపాస్ చేయాల్సిన పని లేకుండా స్టంట్స్ మాత్రమే వేసి ప్రాబ్లం క్లియర్ చేశారు.ఈరోజు ఇన్సూరెన్స్ కూడా లేకపోవడం బాధాకరమైన విషయం. మంచి వాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. అందుకే ప్రభు తన ప్రాబ్లమ్ ను ముందే టెస్టుల ద్వారా తెలుసుకొని పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు.. మీకు ఇక తిరుగులేదు.. మళ్లీ మీరు యంగ్ అయ్యారు.. వారం విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత మళ్లీ యంగ్ హీరోలా మాతోనే కొనసాగుతారు.ఇక ఆసుపత్రిలో ఒక్క పైసా కూడా కట్టనివ్వకుండా అన్ని తానై చూసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలుపకుండా ఉండలేకపోతున్నాము.. థాంక్యూ మెగాస్టార్” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అది మెగాస్టార్ అంటే.. ఊరికే స్టార్స్ అయిపోరు అని కొందరు. అందుకేనయ్యా నువ్వు మెగాస్టార్ అయ్యావ్ అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: