చంద్రబాబు: ఇప్పుడు ఆంధ్ర శ్రీలంక అయిపోదా..?

Divya
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు రోజు రోజుకీ మరింత హీట్ ఎక్కుతున్నాయి. ఇక అందులో భాగంగానే మొన్నటికి మొన్న అధికార పార్టీ వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటించగా.. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి మేనిఫెస్టోని ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఈ మేనిఫెస్టో కాస్త వైరల్ గా మారుతుంది.అంతేకాదు దీనిపై చాలామంది రకరకాల కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం ..ముఖ్యంగా కూటమి మేనిఫెస్టో లో పొందుపరిచిన హామీలు అద్భుతంగా ఉన్నాయి.. చూడగానే ఆహా ఓహో అనేలా ఉన్నాయి.. కానీ చంద్రబాబు పరిపాలన గురించి.. ఆయన స్వభావం గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా ఆయన ప్రకటించిన మేనిఫెస్టోని నమ్మడం లేదు.. అందుకే ఆయన ఎన్ని హామీలను ప్రకటించినా లాభం ఏంటి అంటూ నెటిజన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు..
మరోవైపు కూటమి తాజాగా ప్రకటించిన హామీలను అమలు చేస్తే రాష్ట్రం మరో శ్రీలంక కావడం ఖాయం అని ఇందులో ఎటువంటి సందేహం లేదు అని అభిప్రాయ పడుతున్నారు నెటిజెన్లు.. గతంలో వైయస్ జగన్ హామీలను ప్రకటించినప్పుడు ఈ హామీలు ప్రజలు పొందితే.. కచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ అప్పుడు కామెంట్లు చేశారు.. ఇప్పుడు అదే హామీలను ఈయన ప్రకటించడంతో ఇప్పుడు ఆంధ్ర శ్రీలంక కాదా అంటూ నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.. మరొకవైపు చంద్రబాబు ఆచరణ సాధ్యం కానీ హామీలను ప్రకటిస్తూ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారని కామెంట్లు కూడా వ్యక్తం చేస్తున్నారు అధికారం కోసం బాబు ఎన్ని హామీలైనా  ఇస్తారా అంటూ మరికొంతమంది  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

అంతేకాదు కూటమి మేనిఫెస్టో వైసిపి నవరత్నాల మేనిఫెస్టో కి కాపీ పేస్ట్ అని , వైసిపి నవరత్నాల్లో భాగంగా ప్రకటించిన హామీలనే అటు తిప్పి ఇటు తిప్పి కొన్ని కాంగ్రెస్ హామీలను కూడా మిక్స్ చేసి మేనిఫెస్టోని ప్రకటించారని .. వీరికి సొంత టాలెంట్ లేదని.. ఇలాంటివారు రాజకీయాల్లోకి వస్తే ప్రజల్లో అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఎంతమంది బాబు హామీలను నమ్ముతారో చూడాలి.. మరి కొంత మంది బాబు హామీలను నమ్మితే మోసపోవడం ఖాయం అంటూ కూడా స్పష్టం చేస్తున్నారు ..ఏ కోణానా చూసినా సరే.. కూటమి మేనిఫెస్టో అమలు చేయలేని మేనిఫెస్టో అని కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: