చంద్ర‌న్న‌కు ఎందుకు ఓటేయాలి.. టౌన్ టాక్‌.. రూర‌ల్ టాక్ ఎలా ఉందంటే..?

RAMAKRISHNA S.S.
ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఓటేయాలంటే.. త‌మ‌కే ఓటేయాల‌ని.. అన్ని కీల‌క పార్టీలు కూడా చెబుతున్నా యి. ప్ర‌జ‌ల‌కు ఇదే తేల్చి చెబుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీ వ‌ర‌కు కూడా.. అన్ని పార్టీల‌దీ ఇదే మాట‌. ఇదే బాట‌గా ఉంది. మ‌రి ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు ఎందుకు ఓటేయాలి? అనేది గ్రామీణ ప్రాంతాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఈ విష‌యాన్ని చాలా లోతుగానే గ్రామీణులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం టీడీపీ రూ.4 వేల రూపాయ‌లు ఇస్తున్న పింఛ‌న్ల వైపు మెజారిటీ ప్ర‌జ‌లు మొగ్గు చూపేందుకు రెడీ అవుతున్నారు.

ఇదేం త‌క్కువ ఎమౌంట్ కాదు. వైసీపీతోపోల్చుకుంటే.. టీడీపీ ఇస్తున్న నాలుగు వేల ద్వారా.. ఏడాది 12 వేల రూపాయ‌లు అద‌నంగా ల‌బ్దిదారుల‌కు చేరుతుంది. ఐదేళ్ల‌కు లెక్కించుకుంటే.. ఇది 60 వేల రూపాయ‌లుగా ఉంది. ఇంత పెద్ద మొత్తంగా.. అందే పింఛ‌నును వ‌దులుకునేందుకు గ్రామీణులు సిద్ధంగా లేదు. ఇక‌, 7 ల‌క్ష‌ల‌కు పైగా ఉన్న దివ్యాంగుల‌కు నెల‌కు రూ.3 వేల రూపాయ‌లు అద‌నంగా అంద‌నుంది. ఇది కూడా.. ఏడాది 36 వేల చొప్పున అద‌నంగా చేరుతుంది.

ఇంత పెద్ద మొత్తం అందించ‌డంపై గ్రామీణ స్థాయిలో అయితే.. ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు వ‌స్తే.. చంద్ర‌బాబుకు ఓటెందుకు వేయాల‌న్న విష‌యంపై రెండు రీజ‌న్లు క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ర‌వాణా చార్జీలు భారీగా పెరిగిపోయాయి. బ‌స్సు ఎక్కి దిగితే.. రూ.20 వ‌ర‌కు ఖ‌ర్చు. ఇక‌, ఆటోల విష‌యానికి వ‌స్తే.. ఇది రూ.50 వ‌ర‌కు ఉంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబ చెబుతున్న ఉచిత ఆర్టీసీ ప్ర‌యాణం క‌నుక సాకారం అవుతుంద‌ని భావిస్తే.. మ‌హిళా ప్ర‌యాణికుల‌కు పంట పండిన‌ట్టే.

దీనిపై మ‌హిళ‌ల‌కు ఎక్కువ‌గానే ఆశ‌లు ఉన్నాయి. ఇది అమ‌లు కాద‌ని చెప్ప‌డానికి వీల్లేదు. ఎందుకంటే.. పొరుగున ఉన్న తెలంగాణ‌లో ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప్ర‌యాణం అందిస్తున్నారు. ఇది జ‌రుగుతున్న వాస్త‌వం. ఇక‌, పొరుగున ఉన్న మ‌రోరాష్ట్రం క‌ర్ణాటక‌లోనూ ఈ ప‌థ‌కం అమ‌ల‌వుతోంది. కాబ‌ట్టి ఏపీలోనూ అమ‌ల‌వుతుంద‌ని న‌మ్ముతున్న ప‌రిస్థితి ఉంది. ఇక‌, ఏటా మూడు సిలిండ‌ర్ల హామీ కూడా.. మ‌హిళ‌ల‌పై మంత్ర దండం మాదిరిగానే ప‌నిచేస్తోంది. ఈ మూడు కార‌ణాల‌తో .. చంద్ర‌న్న‌కు ఓటే స్తే.. త‌ప్పేంట‌నే ప్ర‌శ్న ఇప్పుడిప్పుడే మొద‌ల‌వుతోంది. మ‌రి చివ‌ర‌కు బ‌ల‌ప‌డుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: