తెలుగు గ‌డ్డ‌పై ఎస్సీ సీట్ల రాజ‌కీయంలో మ‌లుపులు.. ఎత్తులు...!

RAMAKRISHNA S.S.
- ఏపీలో 29 అసెంబ్లీ, 4 పార్ల‌మెంటు సీట్లు ఎస్సీల‌కు రిజ‌ర్వ్‌
- తెలంగాణ‌లో 3 పార్ల‌మెంటు స్థానాలు కూడా వాళ్ల‌కే..
- 2019 ఎన్నిక‌ల్లో 27 సీట్ల‌లో జ‌గ‌న్ హ‌వా కొండ‌పిలో టీడీపీ.. రాజోలులో జ‌న‌సేన విజ‌యం
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ సారి ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం ఎలా ? ఉండ‌బోతోంది ?  మ‌లుపులు ఎలా ఉండ‌బోతున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌రు ఎవ‌రిని గెలిపించి.. ఎవ‌రిని సీఎం చేస్తారు ? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో ఉన్న 4 ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ పార్ల‌మెంటు స్థానాల‌ను వైసీపీ గెలుచుకుంది. ఇక 29 ఎస్సీ సెగ్మెంట్ల‌లో కొండ‌పిలో టీడీపీ, రాజోలులో జ‌న‌సేన మాత్ర‌మే గెలిచాయి. మిగిలిన అన్నింటిని వైసీపీ స్వీప్ చేసింది.

ఈ సారి ప‌రిస్థితి వైసీపీకి మ‌రి అంత వ‌న్‌సైడ్‌గా అయితే లేదు. సీమ జిల్లాల‌తో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్న సెగ్మెంట్ల‌లో మాత్రం వైసీపీ ఆధిక్యం క‌నిపిస్తోంది. ఇటు తెలంగాణ‌లోనూ మూడు పార్ల‌మెంటు స్తానాలు ఎస్సీల‌కు రిజ‌ర్వ్ అయ్యి ఉన్నాయి. వీటికి కూడా ఎంపీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ సారి నాగ‌ర్ క‌ర్నూల్ నుంచి ఆర్ఎస్ . ప్ర‌వీన్ కుమార్ బీఆర్ఎస్ త‌ర‌పున పోటీలో ఉండడం విశేషం. ఏపీ, తెలంగాణ‌లో ఉన్న రిజ‌ర్వ్‌డ్ అసెంబ్లీ, పార్ల‌మెంటు స్థానాల నుంచి ఏయే పార్టీల త‌ర‌పున ఎవ‌రెవ‌రు పోటీలో ఉన్నారో చూద్దాం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ పార్ల‌మెంటు స్థానాలు ( 4)
........................................................................................
1) అమ‌లాపురం :  గంటి హ‌రీష్ మాథూర్ ( టీడీపీ) - రాపాక వ‌ర‌ప్ర‌సాద‌రావు ( వైసీపీ)
2) బాప‌ట్ల :  తెన్నేటి కృష్ణ ప్ర‌సాద్ ( టీడీపీ) - నందిగం సురేష్ ( వైసీపీ)
3) తిరుప‌తి : వెల‌గ‌ల‌ప‌ల్లి వ‌ర‌ప్ర‌సాద‌రావు ( బీజేపీ ) - గురుమూర్తి ( వైసీపీ )
4) చిత్తూరు : ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద‌రావు ( టీడీపీ ) - ఎం. రెడ్డ‌ప్ప ( వైసీపీ )

తెలంగాణ‌ ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ పార్ల‌మెంటు స్థానాలు ( 3)
........................................................................................
1) వ‌రంగ‌ల్‌ : డాక్ట‌ర్ క‌డియం కావ్య ( కాంగ్రెస్ ) - ఆరూరి ర‌మేష్ ( బీజేపీ ) - సుదీర్‌కుమార్ ( బీఆర్ఎస్ )
2) నాగ‌ర్ క‌ర్నూల్‌ :  మ‌ల్లుర‌వి ( కాంగ్రెస్ ) -  పోతుగంటి భ‌ర‌త్‌కుమార్ ( బీజేపీ ) - ఆర్ఎస్ ప్ర‌వీణ్ ( బీఆర్ఎస్ )
3) పెద్ద‌ప‌ల్లి: గ‌డ్డం వంశీ ( కాంగ్రెస్ ) - గోమాస శ్రీనివాస్ ( బీజేపీ ) - కొప్పుల ఈశ్వ‌ర్ ( బీఆర్ఎస్ )

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ అసెంబ్లీ స్థానాలు ( 29)
........................................................................................
ఉత్త‌రాంధ్ర :
1) రాజాం - కోండ్రు ముర‌ళీమోహ‌న్ ( టీడీపీ) - డాక్ట‌ర్ త‌లే రాజేష్ ( వైసీపీ)
2) పార్వ‌తీపురం - బోనేల విజ‌య్‌చంద‌ర్ ( టీడీపీ) - అల‌జంగి జోగారావు ( వైసీపీ)
3) పాయ‌క‌రావుపేట - వంగ‌ల‌పూడి అనిత ( టీడీపీ) - కంబాల జోగులు ( వైసీపీ)
తూర్పు గోదావ‌రి :
4) అమ‌లాపురం - అయితాబ‌త్తుల ఆనంద‌రావు ( టీడీపీ) - పినిపే విశ్వ‌రూప్ ( వైసీపీ)
5) రాజోలు - దేవ‌వ‌ర‌ప్ర‌సాద్ ( జ‌న‌సేన‌) - గొల్ల‌ప‌ల్లి సూర్యారావు ( వైసీపీ)
6) పి.గ‌న్న‌వ‌రం- గిడ్డి స‌త్య‌నారాయ‌ణ ( జ‌న‌సేన‌) - విప్ప‌ర్తి వేణుగోపాల్ ( వైసీపీ)
ప‌శ్చిమ గోదావ‌రి :
7) గోపాల‌పురం - మ‌ద్దిపాటి వెంక‌ట్రాజు ( టీడీపీ) - తానేటి వ‌నిత ( వైసీపీ)
8) కొవ్వూరు - ముప్పిడి వెంక‌టేశ్వ‌ర‌రావు ( టీడీపీ) - త‌లారి వెంక‌ట్రావు ( వైసీపీ )
9) చింత‌ల‌పూడి - సొంగా రోష‌న్‌కుమార్ ( టీడీపీ) - కంభం విజ‌య‌రాజు ( వైసీపీ)
కృష్ణా :
10) తిరువూరు - కొలిక‌పూడి శ్రీనివాస్ ( టీడీపీ) - న‌ల్ల‌గ‌ట్ల స్వామిదాస్ ( వైసీపీ)
11) నందిగామ - తంగిరాల సౌమ్య ( టీడీపీ) - మొండితోక జ‌గ‌న్మోహ‌న్‌రావు ( వైసీపీ)
12) పామ‌ర్రు - వ‌ర్ల కుమార్ రాజా ( టీడీపీ) - కైలే అనిల్‌కుమార్ ( వైసీపీ)
గుంటూరు :
13) తాడికొండ - తెనాలి శ్ర‌వ‌ణ్‌కుమార్ ( టీడీపీ) - మేక‌తోటి సుచ‌రిత ( వైసీపీ)
14) ప్ర‌త్తిపాడు - బూర్ల రామాంజ‌నేయులు ( టీడీపీ) - బాల‌సాని కిర‌ణ్‌కుమార్ ( వైసీపీ)
15) వేమూరు - న‌క్కా ఆనంద్‌బాబు ( టీడీపీ) - వ‌రికూటి అశోక్‌బాబు ( వైసీపీ)
ప్ర‌కాశం :
16) య‌ర్ర‌గొండ‌పాలెం - గూడూరి ఎరిక్ష‌న్‌బాబు ( టీడీపీ) - తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ ( వైసీపీ)
17) సంత‌నూత‌ల‌పాడు - బీఎన్‌. విజ‌య్‌కుమార్ ( టీడీపీ) - మేరుగ నాగార్జున ( వైసీపీ)
18) కొండ‌పి - డీబీవీ స్వామి ( టీడీపీ ) - ఆదిమూల‌పు సురేష్ ( వైసీపీ)
నెల్లూరు :
19) గూడూరు - పాశం సునీల్ ( టీడీపీ) - మేరిగ ముర‌ళీధ‌ర్ ( వైసీపీ)
20) సూళ్లూరుపేట - నెల‌వ‌ల విజ‌య‌శ్రీ ( టీడీపీ) - కిలివేటి సంజీవ‌య్య ( వైసీపీ)
చిత్తూరు :
21) స‌త్య‌వేడు - కోనేటి ఆదిమూలం ( టీడీపీ) - నూక‌తోటి రాజేష్ ( వైసీపీ)
22) జీడీ నెల్లూరు - డాక్ట‌ర్ ఎంవీ. థామ‌స్ ( టీడీపీ) - క‌ళ‌త్తూరు కృపాల‌క్షి ( వైసీపీ)
23) పూత‌ల‌ప‌ట్టు - కె. ముర‌ళీమోహ‌న్ ( టీడీపీ) - ఎం. సునీల్ కుమార్ ( వైసీపీ)
క‌ర్నూలు :
24) నందికొట్కూరు - గిత్తా జ‌య‌సూర్య ( టీడీపీ) - దార సుధీర్ ( వైసీపీ)
25) కోడుమూరు - బొగ్గుల ద‌స్త‌గిరి ( టీడీపీ) - ఆదిమూల‌పు స‌తీష్ ( వైసీపీ)
క‌డ‌ప :
26) రైల్వేకోడూరు - అర‌వ శ్రీథ‌ర్ ( టీడీపీ) - కొరుముట్ల శ్రీనివాసులు ( వైసీపీ)
27) బ‌ద్వేలు - బొజ్జా రోష‌న్న ( బీజేపీ ) - దాస‌రి సుధ ( వైసీపీ)
అనంత‌పురం :
28) మ‌డ‌క‌శిర - ఎంఎస్‌. రాజు ( టీడీపీ) - ఈర ల‌క్క‌ప్ప ( వైసీపీ)
29) శింగ‌న‌మ‌ల - బండారు శ్రావ‌ణి ( టీడీపీ ) - ఎం. వీరాంజ‌నేయులు ( వైసీపీ)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: