టిడిపి: ఆ ఇద్దరే బాబును ముంచేస్తున్నారా..?

Divya
ఈసారి ఎన్నికలలో చంద్రబాబుని ఓడించే ప్రధాన అభ్యర్థిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అందరూ అనుకుంటూ ఉంటారు.. కానీ ఇక్కడ అలా ఏమి కనిపించలేదు.. చంద్రబాబుని నిలువునా మంచేలా కనిపిస్తున్నది మిత్రపక్ష పార్టీ నేతలే అనే చర్చ కూడా జరుగుతోంది..  ప్రధాన మోడీ, పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ముంచేలా కనిపిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ భయం టిడిపి శ్రేణులలో కూడా కనిపిస్తోంది. నిజానికి చంద్రబాబుకు క్షేత్రస్థాయిలో  వాస్తవాలు చెప్పేవారు ఎవరు లేరని వాదన కూడా ఇప్పుడు నిజం అయ్యేలా కనిపిస్తోంది.

బిజెపి జనసేన పార్టీతో టిడిపి పొత్తు పెట్టుకోవడానికి చాలా నిర్దిష్టమైన కారణాలు ఉన్నాయి. ఏ లక్ష్యంతో పొత్తు పెట్టుకున్నారో అందుకు విరుద్ధంగా ఇప్పుడు కూటమిలో జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. బిజెపితో పొత్తు వల్ల టిడిపి లాభపడుతుందని భావించిన చంద్రబాబు జనసేన పొత్తు వల్ల కూడా ఉభయ గోదావరి జిల్లాలలో కాపు నేతలు టిడిపికి ఓట్లు వేస్తారని చంద్రబాబు ఎంతో ఆశగా ఉన్నారు.. ఈ విషయంలో బాబు అంచనా తప్పిందని క్షేత్రస్థాయిలో కూడా పరిస్థితులు వినిపిస్తున్నాయి.

పవన్ బిజెపి పార్టీ వల్ల కొన్ని సామాజిక వర్గాలు ఓట్లు కూడా పోగొట్టుకోవడంతోపాటు టిడిపి పార్టీ కూడా తీవ్ర నష్టాన్ని మిగిల్చేలా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో బిజెపి పార్టీ ముస్లింల పైన కాస్త విద్వేషపూరితంగానే కామెంట్స్ చేస్తున్నారు. దీంతో టీడీపీకి అనుకూలమైన ముస్లిం ఓటర్లు కూడా దెబ్బేసేలా కనిపిస్తోంది. ఇప్పటికే క్రిస్టియన్ ఓటర్లు కూడా టిడిపి పార్టీకి మద్దతు ఇచ్చేలా కనిపించడం లేదు. పవన్ విషయానికి వస్తే ఉభయగోదావరి జిల్లాలలో తమ సామాజిక వర్గం చాలా బలంగా ఉందని పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు తెలిపారు. అలాగే కాపు రిజర్వేషన్ గురించి కూడా ప్రస్తావిస్తూ జగన్ ని గండి కొట్టాలని చూసిన పవన్ కళ్యాణ్ పైన తీవ్రమైన ఆరోపణలు వినిపించాయి.

దీంతో పవన్ కళ్యాణ్ అజ్ఞానం వల్ల టిడిపికి మరొకసారి దెబ్బ పడేలా కనిపిస్తోంది. అటు బిజెపితో ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ ఓటర్లు దెబ్బ పడడమే కాకుండా పవన్ కళ్యాణ్ కుల పిచ్చి కామెంట్స్ వల్ల చంద్రబాబుకు చాలా నష్టం జరిగేలా కనిపిస్తోంది. దీంతో ఈ ఇద్దరి నేతలే చంద్రబాబును ముంచేసేలా కనిపిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: