భార్య కోసం పార్టీ మారి.. అనుకున్నది సాధించాడు?

praveen
గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇక కెసిఆర్ ను దెబ్బ కొట్టేందుకు ఎన్నో వ్యూహాలను పన్నుతుంది. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎలా అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేలను గులాబీ పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ ని దెబ్బ కొట్టాలి అనుకున్నాడో.. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఇదే వ్యూహాలను అమలు చేస్తుంది. బిఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలందరూ కాంగ్రెస్ గూటికి చేర్చుకుంటుంది.

 అయితే కొంతమంది నేతలను పార్టీలో చేర్చుకోవడమే కాదు సొంత పార్టీ నేతలను సైతం కాదని ఇక వలస వచ్చిన నేతలకు టికెట్లు కేటాయించడం కూడా చేస్తూ వస్తుంది అని చెప్పాలి. ఇలా మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి విషయంలో కూడా కాంగ్రెస్ ఇలాంటి వ్యూహాన్ని అమలు చేసింది. ఎన్నో ఏళ్ల నుంచి బిఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంత్రిగా పదవి బాధ్యతలు అందుకున్న పట్నం మహేందర్ రెడ్డి ఇక తన భార్య కోసం అక్కున చేర్చుకున్న గులాబీ పార్టీని వదిలి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు .

 భార్య కోసం పార్టీ మారి అనుకున్నది సాధించారు ఆయన. అయితే వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి భార్య పట్నం సునీత మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు పట్న మహేందర్ రెడ్డి. ఏకంగా కాంగ్రెస్కు ఎంతో ప్రతిష్టాత్మకమైన సీఎం రేవంత్ సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరిలో సొంత పార్టీ నేతలను కాదని ఇలా వలస వచ్చిన పట్నం సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం చర్చనీయంశంగా మారింది. అయితే పలువురు నేతల నుంచి అసంతృప్తి వచ్చిన అన్ని సరిచేసుకుంటూ రేవంత్ ముందుకు సాగారు. ఇలా అక్కున చేర్చుకున్న పార్టీని భార్య కోసం వదిలేసిన పట్నం మహేందర్ రెడ్డి ఇక భార్యకు టికెట్ ఇప్పించడంలో సక్సెస్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: