జంపింగ్: RRR కు కలిసొచ్చిందా.. వీడడం కాదు నెగ్గడం తెలియాలి..!

Divya
* వైసీపీ నుంచీ టీడీపీ కి జంప్ అయిన rrr
•సొంత పార్టీకే మోసం..
•వీడడం కాదు నెగ్గి చూపిస్తాడా..
(అమరావతి - ఇండియా హెరాల్డ్)
ఏపీ లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు పార్టీలలో నేతలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నుంచి కూటమిలోకి కొంతమంది జంపింగ్ అవుతుంటే.. కూటమి నుంచి అధికార పార్టీలోకి కూడా మరి కొంతమంది జంప్ అవుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. మరోవైపు ఇతర పార్టీలకు వెళ్లడమే కాదు అక్కడ టికెట్లు కూడా దక్కించుకుంటూ ఉండటం గమనార్హం. అలాంటి వారిలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఒకరు.. గతంలో మూడు సంవత్సరాల పాటు వైసీపీ పార్టీలో ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు గుప్పించారు .. ఈ ఏడాది వైసిపి పార్టీకి రాజీనామా చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా గుప్పించారు. గజినీలాగా ప్రవర్తిస్తున్న జగన్ తో  ఎక్కువ కాలం కొనసాగలేనంటూ రాజీనామా కూడా చేశారు..

రాజీనామా తర్వాత ఆయన టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.. పసుపు కండువా కప్పుకొని రఘురామ మాట్లాడుతూ.. చంద్రబాబుతో మళ్లీ ప్రజల ముందుకు వచ్చాను.. చంద్రబాబు ప్రజల రుణం తీర్చుకుంటాను.. జూన్ 4న చంద్రబాబు,  పవన్ ప్రభంజనం సృష్టించబోతున్నారు అంటూ సభలో తెలిపారు. మరోవైపు  నరసాపురం లోక్ సభ స్థానాలలోనే బిజెపి అభ్యర్థిగా రఘురామకు అవకాశం లభిస్తుందని టిడిపి వర్గాలు అనుకున్నాయి. కానీ శ్రీనివాస వర్మ అనే మరో నేతకు బిజెపి అవకాశం కల్పించడంతో రఘురామకృష్ణరాజుకు సీటు దక్కకపోవడంతో స్థానికంగా నేతలు భగ్గుమన్నారు. దీంతో నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుకు  బిజెపి టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీ ఈయనకు అవకాశం ఇవ్వాలని యోచించింది. అందులో భాగంగానే పశ్చిమ గోదావరిలోని ఏదైనా అసెంబ్లీ స్థానాలలో బరిలో దించాలని అనుకున్నారు..  అందుకే టిడిపి నాయకులు ఆయనకు అవకాశం కల్పించాలని కూడా అనుకున్నారు.. మొదట విజయనగరం లోకసభ స్థానాల్లో పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అయితే ఉత్తరాంధ్ర నాయకులు అంగీకరించలేదు. తమ ప్రాంత సామాజిక సమీకరణల రీత్యా ఇది సరైన నిర్ణయం కాదని.. ఇబ్బంది అవుతున్నట్లు తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లాలలో అప్పటికే అన్ని నియోజకవర్గాలలో టిడిపి అభ్యర్థులను ప్రకటించింది. అయితే అక్కడ ఒకరిని తప్పించి రఘురామకు టికెట్ ఇవ్వాలని భావించినా..అక్కడ  టిడిపికి చుక్కలు ఎదురయ్యాయి.. దీంతో ఉండి టికెట్టు కేటాయించడం జరిగింది. మొదట ఈ టికెట్టు ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు ఇచ్చారు.. కానీ ఆ టికెట్ ను ఇప్పుడు.. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమగోదావరి జిల్లా టిడిపి అధ్యక్ష బాధ్యతలను అప్పగించి.. రఘురామ కృష్ణరాజుకు కేటాయించారు.
ఇక ఇందులో భాగంగానే అటు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉండి ఎమ్మార్వో ఆఫీస్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఇక్కడికి పశ్చిమగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షుడు మంతెన రామరాజు కూడా పాల్గొన్నారు.. మరోవైపు వైసీపీ తరఫున పివిఎల్ నరసింహారాజు పోటీ చేస్తున్నారు..

ఇక  వైసీపీ నుంచి టిడిపిలోకి జంప్ అయ్యి ఉండి నుంచి టికెట్టు దక్కించుకుంటే సరిపోదు అక్కడ ఎమ్మెల్యేగా అధికారంలోకి రావాలని అప్పుడే పార్టీని వీడినందుకు ఒక ప్రతిఫలం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. మరి వైసీపీకి గట్టి పోటీ ఇచ్చి టిడిపి తరఫున ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా rrr అధికారంలోకి వస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: