తెలంగాణలో బిఆర్ఎస్ గెలిచే.. మొదటి సీట్ అదేనట?

praveen
ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. అయితే ప్రతి చోట ఒకే విషయంపై చర్చ జరుగుతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది ఇదే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తిరుగులేని పార్టీగా మారిన బిఆర్ఎస్కు అటు గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. ఏకంగా 39 స్థానాలలో మాత్రమే గెలిపించి ప్రతిపక్ష హోదాని మాత్రమే అప్పజెప్పారు.

 ఇక మరోవైపు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ ఏదైతే చేస్తారో ఇక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అదే చేస్తున్నారు. కారు పార్టీలోని కీలక నేతలు అందరిని ఇప్పటికే కాంగ్రెస్ లో చేర్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. రానున్న రోజుల్లో మరి కొంతమంది కూడా ఒక హస్తం గూటికి చేరే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బిఆర్ఎస్ కు అభ్యర్థులే దొరకని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిణామాల మధ్య ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలవబోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.

 అయితే ఇప్పటికే పార్టీ మారిన నేతల గురించి పక్కన పెడితే ఉన్న నేతలను కాపాడుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలలో విజయం సాధించడం ఒక్కటే మార్గమని భావిస్తున్న టిఆర్ఎస్ కీలక నేతలు.. ఇక పార్టీ అభ్యర్థుల తరుపున ముమ్మర ప్రచార నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో బూత్ స్థాయి సమావేశం నిర్వహించి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ సీట్ పోవడం ఖాయమనీ.. ఉప ఎన్నికలు రావడం వస్తాయి అని కేటీఆర్ కామెంట్ చేశారు. అయితే ఇక సికింద్రాబాద్లో బిజెపిని ఓడించేది కేవలం ఒక బీఆర్ఎస్ మాత్రమే అంటూ వ్యాఖ్యానించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలవబోయే మొట్టమొదటి సీటు అటు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానమే అంటూ ధీమా వ్యక్తం చేశారు కేటిఆర్   రేవంత్ హామీలను నెరవేర్చడంలో విఫలమవుతున్నారని ఆయన సీఎం అయ్యాక రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు ఉన్నాయి అంటూ విమర్శలు గుప్పించారు కేటిఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: