హరీష్ రావు : సుఫారి తీసుకునే అవసరం మాకు లేదు... అది రేవంత్ పని..!

Pulgam Srinivas
రాజకీయం అన్నాక ఒకరి మీద ఒకరు వాద ప్రతి వాదనలు చేసుకోవడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే గతంలో ఓ మీడియా ఇంటర్వ్యూలో భాగంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూ లో హరీష్ రావు ఏమన్నారు అనేది తెలుసుకుందాం. కొంత కాలం క్రితం జరిగిన ఇంటర్వ్యూ లో ఓ మీడియా వ్యక్తి హరీష్ రావుని మీరు సిఫారి తీసుకొని తెలంగాణ లో బీజేపీ నీ గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారా..? అనే ప్రశ్నను అడిగారు.

దానికి హరీష్ రావు స్పందిస్తూ ... సుఫారీ తీసుకోవాల్సిన అవసరం మాకు ఏ మాత్రం లేదు. ఆ అలవాటు రేవంత్ రెడ్డికి ఉంది. ఎందుకో చెప్పాలా..? నా దగ్గర క్లియర్ కట్ ప్రూఫ్ కూడా ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే... ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు బై ఎలక్షన్స్ జరిగాయి. దుబ్బాక లో జరిగిన బై ఎలక్షన్ లలో కాంగ్రెస్ కి డిపాజిట్ పోయింది. ఆ విషయంలో రేవంత్ కాంగ్రెస్ దగ్గర సుపారి తీసుకున్నాడు. హుజరాబాద్ లో కూడా కాంగ్రెస్ డిపాజిట్ పోయింది. అక్కడ కూడా రేవంత్ రెడ్డి సుపారి తీసుకున్నాడు.

అలాగే కొంత కాలం క్రితమే మునుగోడు లో కూడా బై ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోయింది. అక్కడ కూడా రేవంత్ రెడ్డి సుపారి తీసుకున్నాడు. ఆనాటి బై ఎలక్షన్ లలో అయినప్పటికీ మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో అయినప్పటికీ సుపారి తీసుకొని బీజేపీ గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నది మేము కాదు రేవంత్ రెడ్డి. డిపాజిట్లు కోల్పోయేంత బలహీనంగా ఉందా కాంగ్రెస్ పార్టీ..? అక్కడ సిఫారి తీసుకొని వారికి కావాల్సిందంతా చేసి బీజేపీ నీ గెలిపించింది రేవంత్ రెడ్డి అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా హరీష్ రావు వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: