రాయి ఎటాక్: బోండా ఉమకు బిగిసుకుంటున్న ఉచ్చు..!

Divya
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సీఎం జగన్ పైన జరిగిన రాయి దాడి జరగడంతో.. ఆ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. విజయవాడ పోలీసులు ఈ కేసును మరింత వేగవంతంగా చేపడుతున్నారు. ఇప్పటికే పదిమందికి పైగా నగరంలోని వడ్డెర కాలనీ యువకులని పిలిపించి పలు రకాల ప్రశ్నలు కూడా పోలీసులు వేస్తున్నారు. ఇందులో సతీష్ అనే యువకుడు రాయి విసిరినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత బోండా ఉమ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వేముల దుర్గారావు అనే మరో యువకుడిని కూడా తీసుకువెళ్లి మరి పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.

ఈ ఒక్కడి నుంచే కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే ఈ రాయి విసిరిన ఘటనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉంటే ఇచ్చిన వారికి  రెండు లక్షల రూపాయలు ప్రకటించారు పోలీసులు.. అలాగే సీసీటీవీ ఫుటేజ్ దొరకపోవడంతో పాటు అక్కడ యువకుల్ని కూడా అదుపులోకి తీసుకొని మరి విచారణ చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కు సంబంధించి ఇందులో హస్తము ఉందా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట.
దీంతో బోండా ఉమ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి తనకు సీఎం జగన్ పైన రాయి దాడికి ఎలాంటి సంబంధం లేదంటూ అధికారులు కేవలం తనను ఇరికించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే విధంగా ఆరోపణలు చేయడం జరుగుతొంది. తన ఆఫీసులో పనిచేసేటువంటి దుర్గారావు అనే వ్యక్తిని ఇలా అదుపులోకి తీసుకోవడం దుర్గారావు తనకు ప్రతిరోజు ఫోన్ చేసి కార్యక్రమాల షెడ్యూల్ కూడా చెబుతూ ఉండేవారని కావాలంటే ఈ ఫోన్ విషయం ద్వారా రికార్డులను తెలుసుకోవచ్చని కూడా వెల్లడించారు ఉమ. అయితే అన్యాయంగా తనను ఇరికిస్తే మాత్రం జూన్ 4వ తరగతి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఉమ ఫైర్ అయ్యారు. ఉమ మాట్లాడినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతోంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఈ రాయి కేసు బోండా ఉమ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: