టీడీపీ: బాబు మెడకు మళ్లీ ఓటుకు నోటు కేసు..!!

Divya
2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా అక్కడ నేతలకు డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కూడా కొనాలనే ప్లాన్ తో చంద్రబాబు ప్రయత్నించగా.. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో అప్పటినుంచి ఓటుకి నోటు కేసు చంద్రబాబుకు చుక్కలు చూపెడుతోంది. ముఖ్యంగా చంద్రబాబు మాట్లాడిన మాటలు ఏసీబీ బయట పెట్టింది. ఈ కేసు పైన ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ... ఈ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ కూడా పిటిషన్ వేయడం జరిగింది.

దర్యాప్తు సైతం సీబీఐకి అప్పగించినప్పటికీ.. 2015లో ఓటుకు నోటు కేసు జరగగా .. 2017లో కూడా సుప్రీం కోర్టులో ఈ కేసు నమోదు అయ్యింది.గత ఐదు నెలలుగా చిన్న చిన్న కారణాలతో కేసును వాయిదా వేస్తూ  వస్తున్నారు చంద్రబాబు. అయితే అన్ని సాక్ష్యాలు ఉన్నా.. కేసు విచారణ ఆలస్యం అవుతోంది. దీంతో ఏడేళ్లయినా ఈ విచారణ జరగకపోతే.. ఇక సామాన్యులకు ఎలాంటి న్యాయం జరుగుతుందంటూ పలువురు నేతలు తెలుపుతున్నారు. ఈ కేసును సిబిఐకి దర్యాప్తు చేయాలని అప్పగించారు. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ ముత్తయ్య , సెబాస్టియన్ ఈ విషయం పైన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.

వీరితో పాటు మాజీ మంత్రులు కూడా మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలంటూ కోర్టుని కోరడం జరిగింది. ఏడేళ్లయిన చిన్న కారణాలతో తప్పించుకొని తిరుగుతున్నారంటూ ఎమ్మెల్యే ఆర్కే ఫైర్ అయ్యారు. రెడ్ హ్యాండెడ్ గా ఆడియో , వీడియోలతో దొరికినా.. దొరలాగా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. నోట్ల కట్టలతో చిక్కిన వ్యక్తి తెలంగాణ సీఎం అయ్యారు.. నోట్లు పంపిన వ్యక్తి సీఎం కావాలని ఇప్పుడు తిరుగుతున్నారంటూ తెలిపారు. రేపటి రోజున సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగబోతోంది. దీన్నిబట్టి చూస్తే మళ్ళీ చంద్రబాబు మెడకు చుట్టుకున్న ఈ ఓటుకు నోటు కేసు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదని  పలువురు నేతలు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: