2 ఏళ్ల హాయ్ నాన్న : 31 కోట్ల టార్గెట్.. ఎన్ని కోట్ల లాభాలను అందుకుందో తెలుసా..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని కొంత కాలం క్రితం హాయ్ నాన్న అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటించగా ... శౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని 2023 వ సంవత్సరం డిసెంబర్ 7 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ ఆ సమయంలో మంచి విజయం సాధించింది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటిదో రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సినిమా ఆ సమయం లో ఎన్ని కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరి లోకి దిగి , ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసి , ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 11.83 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 2.51 కోట్లు , ఉత్తరాంధ్రలో 2.53 కోట్లు , ఈస్ట్ లో 1.4 కోట్లు , వెస్ట్ లో 87 లక్షలు , గుంటూరు లో 1.27 కోట్లు , కృష్ణ లో 1.32 కోట్లు , నెల్లూరు లో 60 లక్షలు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.5 కోట్లు , ఓవర్సీస్ లో 9.3 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 36.13 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 30.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 31 కోట్ల టార్గెట్ తో ప్రపంచ వ్యాప్తంగా బాక్సా ఫీస్ బరి లోకి దిగింది. ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 36.13 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. దానితో ఈ మూవీ 5.30 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: