ఆమె వల్లే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్ప..జయాబచ్చన్ షాకింగ్ కామెంట్స్..!
ఈ విరామానికి అసలు కారణం తన కూతురు శ్వేత బచ్చన్ కారణమంటూ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. జయా బచ్చన్ మాట్లాడుతూ ఒకరోజు నేను షూటింగ్ కి సిద్ధమవుతున్న సమయంలో ఇంట్లోనే మేకప్ వేసుకుంటున్నాను ఆ సమయంలో నా దగ్గరికి వచ్చిన శ్వేత ఏం చేస్తున్నావని అడిగింది? నేను పనికి వెళుతున్నాను అని చెప్పగానే ఆమె అమాయకంగా చూస్తూ అమ్మ నువ్వు వెళ్లొద్దు నాన్నను మాత్రమే వెళ్ళమని చెప్పు అంటూ అడిగింది.. ఆ సమయంలో ఇంట్లో ఎంతమంది ఉన్న తల్లి లేని వెలితి తన కూతురులో గమనించానని ఆ మాటతో సినిమాలకు దూరమయ్యానని తెలిపింది.
అలాగే తన రీఎంట్రీ విషయం పైన జయా బచ్చన్ మాట్లాడుతూ శ్వేత వివాహం తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోయాను, ఏదో కోల్పోతున్నాననే బాధ చాలాసార్లు బాధ కలిగించిందని, ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి మళ్లీ తిరిగి సినిమాలలో నటించడం మొదలు పెట్టానంటూ తెలిపింది. అలా 1995లో డాటర్స్ ఆఫ్ ది సెంచరీ చిత్రంతో రీ ఎంట్రీ మొదలయ్యిందని ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి (2023) వరకు తన సినీ కెరియర్ కొనసాగింది అంటూ తెలియజేసింది. స్టార్ సెలబ్రిటీగా ఉన్న సమయంలో తన కూతురు సంతోషం కోసం తన కెరీయర్ని త్యాగం చేసింది జయా బచ్చన్.