ఏపీ:అంతుచిక్కని జననాడీ..సభ ఎవరిదైనా జనాలు ఫుల్..!

Pandrala Sravanthi
ఎన్నికలు వచ్చాయంటే చాలు  జనాలకు ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది. లీడర్లకు దూల తీరుతుంది అని చెప్పవచ్చు. అలాంటిది ఏపీలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం సూర్యుడిలా మండుతోంది. ఓవైపు టీడీపీ కూటమి  మరోవైపు వైసీపీ  మధ్యలో దూరిన కాంగ్రెస్. ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ  ప్రచారంలో మునిగిపోయింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ  ప్రచారం లో హోరు పెరుగుతుంది. మూడు సభలు ఆరు స్పీచ్ లలాగా దూసుకుపోతున్నారు లీడర్లు. కానీ ఏ పార్టీ గెలుస్తుంది అనేది  ఇప్పటికీ ఒక అంచనాకు రాలేకపోతున్నారు. కొన్ని సర్వేలు టిడిపి గెలుస్తుంది అంటే  మరి కొన్ని సర్వేలు వైసిపి గెలుస్తుందని అంటున్నారు. 

సర్వేలు చేసే వారికి కూడా అంతు చిక్కకుండా జననాడి ఉంది. మొత్తం 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో  ప్రస్తుతం ప్రచారం జోరుగా సాగుతోంది. ఏ పార్టీకి చెందిన నాయకుడైన  ఎలాంటి సభ పెట్టిన,  ర్యాలీ తీసినా జనాలు తండోప తండాలుగా వస్తున్నారట. దీంతో వారు ఎవరికి ఓటు వేస్తారు అనేది  అంతుచిక్కని రహస్యంగా మారింది.  గత కొన్నేళ్ల కింద  ఒక పార్టీలో ఉన్న వ్యక్తి మరో పార్టీ ప్రచారానికి చచ్చిన వెళ్లేవారు కాదు. ఆ టైంలో ఏ పార్టీ గెలుస్తుందో అంచనా వేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు జనాలు కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు.

నాయకులు ఏ విధంగా అవసరాలకు తగ్గట్టు పార్టీలు మారుస్తారో  జనాలు కూడా ఆ విధంగానే ఏ పార్టీ వారు సభ పెట్టినా  ముందుంటున్నారు. దీంతో నాయకులు  గెలుపు పై ధీమా వ్యక్తం చేయలేకపోతున్నారు. సేమ్ ఇలాంటి పరిస్థితి  తెలంగాణ ఎన్నికల్లో కూడా ఏర్పడింది. జననాడి చాలా రహస్యంగా  ఉంచబడింది. చివరి వరకు కూడా  మళ్లీ బీఆర్ఎస్ గెలుస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ జనాలు మాత్రం  కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఏపీలో కూడా ఈ విధమైన స్ట్రాటజీనే  జనాలు ఫాలో అవుతున్నారా అనేది తెలియాలంటే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: