మాజీ మంత్రి Vs మాజీ మంత్రి మ‌న‌వ‌డు... క‌మ్మ Vs రెడ్డి పోరులో విజేత ఎవ‌రు ?

RAMAKRISHNA S.S.
- వైసీపీలో క‌క్క‌లేక మింగ‌లేక పోటీ చేస్తోన్న ' బాలినేని '
- కోట్ల రూపాయ‌ల‌తో ఒంగోలు ద‌శ మార్చిన టీడీపీ ' దామ‌చ‌ర్ల ' జోరు
- స‌మీక‌ర‌ణ‌లు, స‌ర్వేలు యాంటీ కావ‌డంతో వైసీపీలో టెన్ష‌న్ స్టార్ట్‌
( ఒంగోలు - ఇండియా హెరాల్డ్ )
ఒంగోలు జిల్లా కేంద్రమైన ఒంగోలు అసెంబ్లీ పోరు ఈసారి రసవంతరంగా మారింది. ఇక్కడ నుంచి గత ఆరు ఎన్నికలలో కేవలం ఒక్కసారి మాత్రమే ఓడి 5 సార్లు గెలిచిన మాజీ మంత్రి వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ మధ్య సవాళ్లతో కూడిన రాజకీయం నడుస్తోంది. 2014 ఎన్నికలలో బాలినేనికి తొలి ఓటమి రుచి చూపించారు జనార్ధన్. ఒకటి మాత్రం నిజం. దామచర్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒంగోలు నగరంతో పాటు నియోజకవర్గంలో.. కనీ వినీ ఎరుగని రీతిలో ఇంకా చెప్పాలి అంటే మరో 50 ఏళ్లపాటు ఒంగోలులో వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేనంత అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.

ఒంగోలు నగరంలో పార్కులు, విశాలమైన రహదారులు, సిమెంట్ రహదారులు, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సౌకర్యాల కల్పన, ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే జనార్ధన్ చేసిన పనులు ప్రశంసంచాల్సిందే. బాలినేని ఒంగోలు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిననా.. రెండు, మూడు సార్లు మంత్రి పదవి చేపట్టిన జనార్దన్ ఐదేళ్ల అభివృద్ధితో పోలిస్తే చేసింది ఏమి లేదు. 2019 ఎన్నికల్లో గెలిచి తొలి మూడేళ్లు ఆయన మంత్రిగా ఉన్నా కూడా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యం.

చివరకు ఆయన పార్టీని బెదిరించారు. వైసీపీని వదిలి బయటకు వెళ్లి పోతారు.. టీడీపీ నుంచి పోటీ చేస్తారు అన్న ప్రచారం కూడా జరిగింది. ఒంగోలు ఎంపీ సీటు మాగుంటికే ఇవ్వాలని ఎంత బెదిరించినా జగన్ పట్టించుకోలేదు. జగన్ మాత్రం చెవిరెడ్డికే ఇచ్చారు. ఈ పరిణామాలు అన్ని వైసీపీలో ఇటు జగన్ దగ్గర బాలినేని హవా తగ్గిపోయింది అని చెప్పేందుకు నిదర్శనాలు. చివరకు ఒంగోలు ప్రజలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు.. ఇతర విషయాలలో కూడా నోటిఫికేషన్ ముందు వరకు బాలినేని పట్టుబట్టి పోరాటాలు చేసి బెదిరిస్తే తప్ప పనులు కాలేదు.

దీనికి తోడు నియోజకవర్గంలో బలంగా ఉన్న కాపు, బలిజ సామాజిక వర్గ ఓటర్లు ఈసారి కూటమివైపు సపోర్ట్ చేస్తున్నారు. కమ్మ, బీసీ, యాదవ వర్గాల మద్దతు కూడా జనార్దన్ కే కనిపిస్తోంది. బాలినేని 2019లో గెలిచి మంత్రి అయినా నియోజకవర్గానికి.. ఇటు వ్యక్తిగతంగాను ఎవరికి రూపాయి లాభం కూడా జరగలేదని.. మరోసారి జనార్ధన్ కు అవకాశం ఇవ్వాలని అందరూ నిర్ణయానికి వచ్చేసారు. బాలినేనిలో కూడా తనవల్ల ఏ పని కావటం లేదన్న నైరాశ్యం అయితే కనిపిస్తోంది. అయితే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఎన్నికలకు వెళుతున్న పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: