జగన్ పై దాడి.. పవన్‌కు మైనస్‌ అవుతోందా?

Chakravarthi Kalyan
సీఎం జగన్ కి గాయమైన తర్వాత చాలా మంది నాయకులు సానుభూతి తెలిపారు. ప్రధాని మోదీ సైతం సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం తన సానుభూతిని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఎన్డీయే కూటమిలోని చంద్రబాబు నాయుడు సైత రాళ్ల దాడిలో ఉన్న నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇంత వరకు బాగానే ఉన్నా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఈ దాడిపై కనీసం ఒక్క పోస్టు కూడా చేయలేదు. పైగా తెనాలి సభలో మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కు గాయమైతే రాష్ట్రానికే గాయం అయినట్లు వైసీపీ  నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బాపట్ల జిల్లాలో అమర్నాథ్ అనే బాలుడిని చంపేసినప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో 30వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయితే గాయం కాలేదా అని అడిగారు. సుగాలి ప్రీతి కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అని ప్రశ్నించారు. జగన్ చుట్టూ భద్రత ఉందని.. ఆపై జెండాలున్నాయని అంత భద్రత ఉన్న సీఎం పై రాయి వేయడమా? అని లాజిక్ తీశారు. మీరే దాడులు చేస్తారు.. ఆపై మీపైనే దాడులా అని ప్రశ్నించారు. డీజీపీ, , నిఘా విభాగం ఏం చేస్తున్నట్లు అని అడిగారు.

నాన్నా పులి వచ్చే.. కథలా ఎన్ని సార్లు నమ్మాలి. మాకు నమ్మకం పోయింది. ఈ డ్రామాలు ఆపాలంటూ సెటైర్లు వేశారు. అయితే రాష్ట్ర సీఎంపై దాడి జరిగితే సానుభూతి చూపాల్సింది పోయి ఇలా వెటకారంగా మాట్లాడటం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్టీలు వేరైనా.. నాయకుల మధ్య వ్యక్తిగత వైరం ఉండకూడదంటూరు. కానీ జగన్ విషయంలో అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ లు కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: