పట్టువదలని విక్రమార్కుడు.. ఎన్నికల్లో 98 సార్లు ఓడాడు.. అయినా మళ్లీ పోటీ?

praveen
సాధారణంగా ఈ భూమి మీద పుట్టిన మనుషులకు ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది  ఒకరికి పరీక్షల్లో టాప్ ర్యాంక్స్ సంపాదించాలని.. ఇంకొకరికి మంచి ఉద్యోగం సంపాదించాలని.. మరొకరికి ఇక బిజినెస్ లో అందరికంటే అగ్రస్థానానికి చేరుకోవాలని ఆశ ఉంటుంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కో పిచ్చితో ముందుకు సాగుతూ ఉంటారు. ఇంకొంద మందికి చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు కాదు.. ఏదైనా విన్యాసాలు చేసి ప్రపంచ రికార్డులు సాధిస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది  అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తికి కూడా ఇలాంటి ఒక పిచ్చి ఉంది.

 అదేంటంటే ఎలక్షన్స్ పిచ్చి. ఇలా పాలిటిక్స్ పిచ్చి చాలామందికి ఉంటుంది. రాజకీయాల్లోకి రావాలని.. మంచి  పదవులు సంపాదించాలని ఎంతోమంది ఆశ పడుతూ ఉంటారు. ఈయనకు కూడా ఇలాంటి ఒక ఆశ ఉంది. అందులో కొత్త ఏముంది అనుకుంటున్నారు కదా.. సాధారణంగా ఎన్నికల్లోకి వచ్చి మంచి పదవులు చేపట్టాలని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ ఈయన మాత్రం ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ ఎన్నోసార్లు ఓడిపోయాడు. అయినప్పటికీ ఇప్పటికీ పోటీ చేస్తూనే ఉన్నాడు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండాఎన్నికల్లో పోటీ చేయడమే ఆయన పిచ్చి. అందుకే ప్రస్తుతం ఆయన వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు.

 ఆగ్రాకు చెందిన హన్శురాం అంబేద్కరీ అనే 78 ఏళ్ల వ్యక్తికి ఎన్నికలతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1985 నుంచి ఇప్పటివరకు 98 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు ఆయన   అయితే ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయారు  ఇన్నిసార్లు ఓడిపోయిన తర్వాత ఎవరైనా పాలిటిక్స్ పై ఆశలు వదులుకుంటారు. కానీ ఈయన మాత్రం పట్టు వదలని విక్రమార్కుడు. రానున్న ఎన్నికలకు ఆగ్ర, ఫతేపూర్ సిక్రీ స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నారు  పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు అన్నింట పోటీ చేశా  రాష్ట్రపతి పదవికి కూడా ట్రై చేశా . కానీ తిరస్కరించారు. ఇక 100 సార్లు పోటీ చేయడమే నా లక్ష్యం. అది పూర్తయ్యాక పోటీని విరమించుకుంటా అంటూ హన్శురాం అంబేద్కరీ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: