బిఆర్ఎస్ : కేసీఆర్ కు బిగ్ షాక్.. ఆయన కూడా వెళ్లిపోయారు.. ఇక పార్టీ ఖాళీ?

praveen
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయ్.  తెలంగాణలో  లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్న  కాంగ్రెస్ పార్టీ ఇక పార్లమెంట్ ఎన్నికల్లోను అదే రిపీట్ చేయాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయడమే కాదు ఇంకోవైపు ప్రతిపక్ష బిఆర్ఎస్  పార్టీని ఖాళీ చేసే పనిలో బిజీ బిజీగా ఉంది కాంగ్రెస్.

 గత కొంతకాలం నుంచి ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి ఏకంగా కారు పార్టీ నేతలు అందరిని కూడా కాంగ్రెస్ గూటికి చేర్చుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇప్పటికే కడియం, కేకే సహా మరి కొంతమంది కీలక నేతలందరూ కూడా కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. ఇక ఇప్పుడు మరో ఎమ్మెల్యే ఏకంగా కారు తీర్థం పుచ్చుకోవడంతో గులాబీ దళపతి కేసీఆర్ కి బిగ్ షాక్ తగిలింది. ఏ క్షణంలో ఏ ఎమ్మెల్యే పార్టీని వీడుతారో అనే సందిగ్ధత బిఆర్ఎస్ పార్టీలో నెలకొన్న నేపథ్యంలో.. ఇక ఇప్పుడు కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలింది.

 భద్రాచలం బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు . సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుని హస్తం గుర్తుకు చేరుకున్నారు. అయితే పోయింది ఓకే ఎమ్మెల్యే కదా ఇది కెసిఆర్ కు బిగ్ షాక్ ఎందుకు అంటారా.. ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి కేవలం వెంకట్రావు ఒక్కరే విజయం సాధించారు. అక్కడ మిగతా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే  తెల్లం వెంకటరావు కూడా కాంగ్రెస్ లో చేరడంతో అక్కడ బీఆర్ఎస్ ఖాళీ అయింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి అక్కడ సపోర్టే లేకుండా పోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Lcr

సంబంధిత వార్తలు: