ఏపీ : ముస్లిం ఓట్ల కోసం బాబు కొత్త పాట.. ఒక్కరైనా నమ్మే ఛాన్స్ ఉందా?

Reddy P Rajasekhar
ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు నేపథ్యంలో బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం ఓట్ల విషయంలో టీడీపీ తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల్లో కూటమి ఓడిపోతే టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ముస్లిం ఓట్ల విషయంలో చంద్రబాబుకు సైతం భయాందోళన ఉంది. ఇప్పటికే చంద్రబాబు ముస్లిం పెద్దలను కలిసి తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ముస్లింలకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
 
తాజాగా పల్నాడు జిల్లా క్రోసూరులో జరిగిన ప్రజాగళం సభలో ముస్లిం ఓట్ల కోసం బాబు కొత్త పాట పాడారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ముస్లింలపై అనేక దాడులు జరిగాయని ముస్లిం మహిళలు, బాలికలను వైసీపీ నేతలు వేధించారని బాబు చెప్పుకొచ్చారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అలాగే ఉంటాయని 2014లో కూడా బీజేపీతో పొత్తు ఉందని నా పాలనలో ముస్లింలకు అన్యాయం జరిగిందా అంటూ బాబు ప్రశ్నించారు.
 
ఏపీలోని ముస్లింల రక్షణకు నేను హామీ ఇస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. అయితే వైసీపీ పాలనలో ముస్లింలకు అన్యాయం జరిగిందని ముస్లింలపై దాడులు జరిగాయని బాబు చేసిన కామెంట్లను ఒక్కరైనా నమ్మే ఛాన్స్ ఉందా? అని రివర్స్ లో బాబుకే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఓటర్లు అన్నీ గమనిస్తూ ఉంటారని టీడీపీ బీజేపీ పొత్తు వల్ల ముస్లింలు ఇప్పటికే ఏ పార్టీకి ఓటేయాలో ఫిక్స్ అయ్యారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
కేంద్రం సహకారం రాష్ట్రానికి అవసరమైతే పొత్తు పెట్టుకోవాలని రూల్ లేదని మద్దతు ఇచ్చినా చాలని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు. పొత్తు వల్ల  బీజేపీ ఏపీ ప్రజలకు ఏవైనా ప్రత్యేక హామీలు ఇచ్చిందా? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీతో పొత్తు వల్ల టీడీపీ 20 నుంచి 30 స్థానాల్లో నష్టపోయే ఛాన్స్ ఉందని టీడీపీ అనుకూల సర్వేలు సైతం వెల్లడించడం గమనార్హం. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత చంద్రబాబుకు వాస్తవాలు అర్థమవుతాయని ఏపీ సామాన్యులలో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: