నెల్లూరు : ఆసక్తికరంగా ఆత్మకూరు రాజకీయం.. ఈ సారి గెలుపెవరిదంటే..?

murali krishna
ఆంధ్రప్రదేశ్ లోని కీలక నియోజకవర్గాలలో ఆత్మకూరు ఒకటి.. సోమశీల డ్యామ్ ఈ పరిధిలోనే ఉంటుంది.. ఇక్కడ రాజకీయాలలో ఆనం,మేకపాటి కుటుంబానికి చాలా ప్రాధాన్యత వుంది.. సెగ్మెంట్ లో ఈ కుటుంబాలకి మంచి పేరు కూడా వుంది..సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి 2019 ఎన్నికలలో గెలిచి వైఎస్ జగన్ హయాంలో మంత్రిగా పని చేశారు..2022 లో గుండెపోటుతో ఆయన మరణించారు..ఆ తరువాత వచ్చిన ఉప ఎన్నికలలో ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు..2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి 53 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు..టీడీపీ నుంచి పోటీ చేసిన బొల్లినేని కృష్ణయ్య కు 40 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి..ఇతరులకు 7 శాతం ఓట్లు దక్కాయి..గత ఎన్నికలలో విపక్ష సభ్యుడిగా ఉండిపోవటం వల్ల ఆత్మకూరు అభివృద్ధి చేయలేకపోయానని 2019 ఎన్నికలలో గౌతమ్ రెడ్డి ప్రచారం చేయడంతో ఆ సింపతీ కలిసి వచ్చి ఆ ఎన్నికలలో ఆయన ఘన విజయం సాధించారు.ఆయన హఠాత్మరణంతో మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేయడం భారీ మెజారిటీతో గెలవడం చక చక జరిగిపోయాయి. 

ఇక  ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఆయన తండ్రి వెంకట్ రెడ్డి కూడా ఆత్మకూరు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా పనిచేసారు. 2009 లో ఆనం ఆత్మకూరులో పోటీచేసి గెలిచారు. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లలో మంత్రిగా పనిచేసారు. ఇదిలావుంటే గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరులో వైసిపి గెలుస్తూ వస్తోంది.. ప్రస్తుతం మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు... ఆయనే 2024 అసెంబ్లీ ఎన్నికల వైసిపి అభ్యర్థి పోటీలో వున్నారు.

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఆత్మకూరు పోటీలో నిలిపింది. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆనం నారాయణ రెడ్డి వైసిపి నుండి టిడిపి వైపు వెళ్లారు. దీంతో ఆయనకు ఆత్మకూరు టికెట్ దక్కింది. దీనితో ఆత్మకూరు లో పోటీ రసవత్తరంగా మారింది.. వైసీపీ చేసిన మోసాలను ప్రజలకి తెలియజేసి ఈ సారి ఎలాగైనా టీడీపీ గెలిచే విధంగా ఆనం నారాయణ రెడ్డి ప్రచారం చేస్తున్నారు..ఇక ఈసారి కూడా ఘన విజయం సాధించి నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవాలని మేకపాటి విక్రమ్ రెడ్డి చూస్తున్నారు.. మరి ఈ సారి ఏ పార్టీ జెండా ఆత్మకూరు ఎగురుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: