మోదీ: మళ్లీ గెలిస్తే దేశంలో ఇన్ని దారుణాలు జరుగుతాయా?

Chakravarthi Kalyan
కేంద్రంలో మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే.. ఏమి జరుగుతుంది? రాజ్యాంగాన్ని మార్చేస్తుందా? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడి షీ జినిపింగ్ లా రాజ్యాంగాన్ని మార్చేసి జీవిత కాల ప్రధానిగా ప్రకటించుకుంటారా? అనే సందేహాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం ఇవే చివరి ఎన్నికలు కావొచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ సారి బీజేపీ 370 సీట్ల లక్ష్యంతో ఎన్నికలకు వెళ్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం చివరి లోక్ సభ సమావేశాల్లో బీజేపీ మళ్లీ 370 సీట్లతో అధికారంలోకి రాబోతుందని ప్రకటించారు. అయితే ఇది ఆషామాషీ ప్రకటన కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం లోక్ సభ సీట్లు 545లో మూడొంతులు అంటే 363 సీట్లకు పైమాటే.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం మొత్తం సీట్లలో మూడోవంతు సీట్లు వస్తే ఆ పార్టీకి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ను అయినా మార్చే శక్తి ఉంటుంది. అందుకే బీజేపీ ఈసారి టార్గెట్ 370 అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. అదే జరిగితే రాజ్యాంగంలో కొన్ని సవరణలు తప్పవని పలువురు అంచనా వేస్తున్నారు.

దీనిపై ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ తన అభిప్రాయాలను పంచుకుంటూ.. మళ్లీ ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరిస్తే..ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆ పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని అడ్డుకోకుంటే ఇవే ప్రజాస్వామ్యానికి చివరి ఎన్నికలు అని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో మణిపుర్ ఘటనను ఉదహరిస్తున్నారు. ఇక్కడ గత ఏడాది కాలంగా హింసాత్మక కాండ ప్రజ్వరిల్లుతున్నా.. ఆడపిల్లలను నగ్నంగా ఊరేగిస్తున్నా.. ప్రధాని అక్కడికి వెళ్లేందుకు తీరిక లేదు. అయినా జనం అంగీకరించి ఓట్లేస్తే అవే పరిస్థితులు ప్రతి రాష్ట్రంలో జరిగే ప్రమాద ముందని అంటున్నారు. అటువంటి పరిస్థితులు నిలువరించడానికి ఒక అవకాశం ఉందని..  వినియోగించుకోకుంటే దేశంలో ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు తీసుకువచ్చిన వారౌతారని తన అభిప్రాయాన్ని వెలువరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: