రాయలసీమ (రాప్తాడు): అభివృద్ధి ఒకవైపు.. అధికారం మరోవైపు..!

Divya
మరో కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అటు అధికార పార్టీ వైసీపీ , ఇటు ప్రతిపక్ష కూటమి టిడిపి , జనసేన, బిజెపి ఎవరికి వారు ప్రచారాలు చేస్తూ తమ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ప్రకటించగా అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రచారాలు నిర్వహిస్తూ తాము చేస్తున్న అలాగే చేయబోయే అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తూ.. ప్రజల్లో నమ్మకం పొందే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే రాప్తాడు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి సునీతమ్మకు టికెట్ లభించింది.. ఈ మేరకు ఆమె అయ్యవారిపల్లి లో ప్రచారం మొదలుపెట్టగా.. అక్కడి గ్రామస్తులు ఆమెకు గజమాలతో స్వాగతం పలికారు.
ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. వాలంటీర్లకు టిడిపి పార్టీ వ్యతిరేకంగా ఉందనేది అవాస్తవం..వైసిపి నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నమ్మవద్దు అంటూ మాజీ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అనంత రూరల్ , ఆత్మకూరు, రాప్తాడు మండలం , చెన్నై కొత్తపల్లి మండలాలలో గురువారం ప్రచారం నిర్వహించిన ఆమె ప్రసన్నాయపల్లి పంచాయితీ అయ్యవారిపల్లి గ్రామ రైతులకు సంబంధించి పొలాల్లోకి వెళ్లడానికి దారి లేదని.. తన దృష్టికి తీసుకురావడంతో సొంత ఖర్చులతోనే దారి ఏర్పాటు చేయిస్తానని ఆమె హామీ ఇచ్చారు.. ఇక తనను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే ఇప్పటివరకు రాప్తాడులో చేసిన అభివృద్ధికి మించి మరింత అభివృద్ధి చేస్తానని కూడా ఆమె హామీ ఇచ్చారు.. మొత్తానికైతే అధికారంలోకి వస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని చెబుతున్నారు సునీత..
మరొకవైపు జగన్ పై విమర్శిస్తూ పేదలు, వృద్ధులు, వికలాంగుల పింఛన్ల పేరుతో జగన్ కొత్త డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ,  వార్డు సచివాలయంలో 1.26 లక్షల మంది సిబ్బంది ఉండగా.. ఇంటింటికి వెళ్లి రెండు రోజుల్లో మొత్తం పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.. కానీ అలా చేయకుండా టిడిపి పై విమర్శలు చేస్తే ప్రజలు నమ్మరు అంటూ సునీత తెలిపారు.. మరోవైపు ఎన్నికల సమయంలో ప్రజలను వైకాపా నాయకులు బలవంతంగా చేర్చుకున్నా వారు పార్టీలో ఉండలేదని ఆమె తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: