మల్కాజిగిరి : బీజేపీకి అదే పెద్ద మైనస్ కాబోతుందా?

praveen
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా మల్కాజ్గిరి స్థానం ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది. ఏకంగా 38 లక్షల మంది ఓటర్లతో మినీ ఇండియా గా పిలుచుకునే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో విజయాన్ని అన్ని పార్టీలు సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఈ పార్లమెంట్ స్థానం ఏర్పాటు అయిన తర్వాత మూడుసార్లు ఎన్నికలు జరగగా రెండుసార్లు కాంగ్రెస్, ఒకసారి టిడిపి విజయం సాధించాయి.

 ఇక ఎప్పటిలాగానే ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మల్కాజ్గిరి నియోజకవర్గంలో గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాలను రంగంలోకి దింపి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయ్ అన్ని పార్టీలు. మరి ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇక మల్కాజిగిరి నియోజకవర్గం విజయాన్ని సొంతం చేసుకోవాలని భారీ వ్యూహం పన్నుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ పదే పదే నినదిస్తున్న బిజెపి ప్రధాని మోదీ రోడ్ షో ఏర్పాటు చేసి ఉత్తర భారత దేశానికి చెందిన ఓటర్లను ఆకట్టుకునేలా ఇప్పటికే స్కెచ్ వేసిందట.

 అయితే రాష్ట్రంలో మెజారిటీ స్థానాలలో విజయం సాధిస్తే.. రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించవచ్చని బిజెపి భావిస్తోందట. మరోవైపు మినీ ఇండియా గా పిలుచుకునే మల్కాజ్గిరిలో విజయం సాధిస్తే తెలంగాణ పై పట్టు సాధించవచ్చు అని అనుకుంటుందట. ఈ క్రమంలోనే తెలంగాణ బిజెపిలో కీలక నేతగా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్ ను మల్కాజిగిరి నుంచి బరిలోకి దింపింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో కాషాయ జెండా ఎగరవేయాలనే పట్టుదలతో ఉంది బిజెపి. కానీ ఒక్క విషయం మాత్రం అటు బిజెపికి మైనస్ గా మారబోతుంది రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది బీజేపీ. కనీసం నాలుగు లక్షల ఓట్లు కూడా సాధించలేకపోయింది.  అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని నమ్మని ప్రజలు ఇప్పుడు నమ్ముతారా అన్నది ఒక ప్రశ్నగా మారింది. అయితే ప్రధాని మోదీ మేనియా పాజిటివ్ టాక్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామనే ఆశాభావంతో బిజెపి నేతలు ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp

సంబంధిత వార్తలు: