ప్లీజ్ మా దేశానికి రండి.. బీసీసీఐ వెంటపడుతున్న పిసిబి?

praveen
వరల్డ్ క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులుగా  కొనసాగుతున్న టీమ్స్ ఏవి అంటే పాకిస్తాన్, ఇండియా జట్ల పేరును చెబుతూ ఉంటారు అందరూ. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ మాత్రం ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా అది ఉత్కంఠ భరితంగా మారిపోతూ ఉంటుంది. అయితే అన్ని టీమ్స్ లాగా ఈ రెండు టీమ్స్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగవు. ఒక దేశ పర్యటనకు మరో దేశం వెళ్లడం అస్సలు జరగదు. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతూ వస్తుంది అని చెప్పాలి. ఈ నిషేధం కారణంగా కేవలం ఐసీసీ ట్రోఫీలలో మినహా ఈ రెండు జట్లు ఎక్కడ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడిన దాఖలాలు ఉండవు.



 అయితే ఇక పాకిస్తాన్ ఇండియా జట్ల మధ్య ఉన్న క్రికెట్ నిషేధాన్ని ఎత్తివేసి మళ్లీ సంబంధాలను పునరుద్ధరించాలి అంటూ ఎన్నో రోజుల నుంచి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఇక బీసీసీఐ విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. అది కుదరడం లేదు. అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నిలో ఆడటానికి పాక్ ఎన్నో ఏళ్ల తర్వాత భారత గడ్డపై అడుగు పెట్టింది. అయితే అటు బీసీసీఐ మాత్రం భారత జట్టును పాకిస్తాన్ కు పంపించే ప్రసక్తి లేదు అంటూ తేల్చి చెబుతుంది. ఈ క్రమంలోనే గతంలో పాకిస్తాన్ వేదికగా జరిగిన ఆసియాకప్ లో పాల్గొనేది లేదు అని తేల్చి చెప్పగా.. చివరికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ కల్పించుకుని భారత జట్టు ఆడబోయే మ్యాచ్లను శ్రీలంక వేదికగా నిర్వహించింది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇక ఇప్పుడు 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీలో  తాము పాకిస్తాన్లో నిర్వహిస్తే తప్పుకుంటాము అంటూ బిసిసిఐ స్పష్టం చేసింది. కానీ అటు మా దేశానికి రండి అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం వెంట పడుతూనే ఉంటుంది. చాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా తమ మ్యాచ్ లు అన్నింటినీ కూడా లాహోర్లో ఆడొచ్చు అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించింది. భద్రతాపరంగా గడాఫీ స్టేడియం సురక్షితమైంది అంటూ తెలిపింది. అలాగే భారత్ నుంచి వాగా బోర్డర్ మీదుగా వచ్చే ప్రేక్షకులు కూడా లాహోర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే చాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ వచ్చే ప్రసిద్ధి లేదని బిసిసిఐ ఎంతలా చెప్పిన.. పిసిబి మాత్రం ఏదో ఒక విధంగా భారత జట్టును రిక్వెస్ట్ చేస్తూనే ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: