దేశంలో మరో మహమ్మారి రాబోతోందా.. టాప్ సైంటిస్ట్ ఏమన్నారంటే..?
కానీ ఒక విషయాన్ని మాత్రం సైంటిస్టులు చాలా ఖచ్చితంగా చెబుతున్నారు. నెక్స్ట్ రానున్న వైరస్ ప్రమాదం మాత్రం మన ముందే తయారవుతుందని భారత వైద్య నిపుణులు సౌమ్య స్వామినాథన్ తెలియజేశారు. వాతావరణంలోని మార్పు వల్ల భూమి వేడెక్కడం జరుగుతుందని దీనివల్ల కొత్త వైరస్లు పుట్టుకొస్తాయని చెబుతున్నారు. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి అడవులు, నగరాలకు ఇలా అంత వ్యాపించేలా వైరస్ ఉండే పరిస్థితులు ఉన్నట్లుగా కనిపిస్తోందని గుర్తుకు చేశారు.
కోవిడ్ తగ్గిపోయిన తర్వాత అందరూ చాలా ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచం చూసిన ప్రధాన వైరస్ మహమ్మారులన్నిటికీ కూడా ఏదో ఒక కామన్ లింక్ ఉన్నది. అలాంటి మహమ్మారి మనుషుల మధ్య పుట్టలేదు. కేవలం జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతున్నాయి. వీటిని సైంటిస్టులు స్పీలోవర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఘటనలు రోజురోజుకి చాలా ప్రమాదంగా మారుతున్నాయని తెలియజేస్తోంది సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్. వాతావరణంలోని మార్పుల వల్ల అధిక ఉష్ణోగ్రతలు రావడం భారీ వర్షాలు కురవడం అడవులు తగలబడిపోవడం వల్ల జంతువుల సహజ నివాసాలను వదిలి మనుషుల దగ్గరకు వస్తాయని.. అప్పుడు అడవులలో ఉండాల్సిన వైరస్ గ్రామీణ ప్రాంతాలను పట్టణాలను కూడా తాకుతాయని ఇది మనకి మనమే సృష్టించుకున్న పరిస్థితులు అంటూ తెలియజేసింది. H1N1, జీకా, నిపా, ఎబోలా వంటి వైరస్ లు అడవులను నరకడం జంతువుల అక్రమ వ్యాపారం లాంటి వాటివల్లే ఈ వైరస్ వ్యాప్తి చెందిందని, ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మారుతున్న కొద్దీ ఈ వైరస్లు మ్యూటేట్ అవుతున్నాయని తెలిపారు. ఈసారి వచ్చే మహమ్మారి ఏ దేశంలో వచ్చిన అన్ని దేశాలకు వ్యాప్తి చెందుతుందని, కరువు, వరదలు వంటివి సంభవిస్తాయి. దీనివల్ల ప్రజలు ఒక చోటు నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే సమయంలో వైరస్ కూడా ప్రయాణిస్తుందని హెచ్చరిస్తున్నారు సౌమ్య స్వామినాథన్. హెల్త్ సిస్టమ్ సరిగ్గా లేనిచోటే ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని తెలియజేస్తున్నారు.