ఏపీ: ఆటో ఎక్కి మరీ డ్రైవర్‌ల సమస్యల గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్!

Suma Kallamadi
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఏం చేసినా క్షణాల్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతుంది. పవర్ స్టార్ చరిష్మా అటువంటిది మరి. తాజాగా అయన ఆటోలో ప్రయాణించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాడు కాకినాడ జిల్లా, కొత్తపల్లి మండలం, కొండెవరంలో ఆయన పర్యటించడం జరిగింది. ఈ క్రమంలో రోడ్డు షోలో భాగంగా కొండెవరం వద్ద ఆటోలో పవన్ మూడు కిలోమీటర్లు మేర పయనించడం జరిగింది. ఈ సందర్భంలో ఆటో డ్రైవర్లు దారుణమైన రహదారుల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఆరా తీయడం జరిగింది. అధికారంలోకి వచ్చాక తమ సమస్యలు పరిష్కరించాలని జనసేనానిని డ్రైవర్‌లు ఈ సందర్భంగా కోరడం జరిగింది.
ఈ నేపథ్యంలో అయన ప్రతి ఒక్కరి ఇబ్బందిని తాను తెలుసుకుంటానని, మీలో ఒకడిగా ఉంటూ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిష్కారం తప్పకుండా చూపుతానని ఆటో డ్రైవర్‌లకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ... "నేను, జనసేన అధినేతను... మీ పవన్‌ కల్యాణ్‌ ని. పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నా. అమ్మలారా, అక్కలారా, అన్నలారా నన్ను మీరు ఆశీర్వదించండి. మీరందరూ దయచేసి ఓటేసి నన్ను గెలిపించండి. అటుపై మీమీ సమస్యలను త్వరితగతిన తప్పక తీరుస్తాను." అని పవన్‌ ప్రజలను కోరారు. ఈ పర్యటనలో పవన్ అధికార పార్టీ వైస్సార్సీపీపైన పెద్ద ఎత్తున విమర్శలు చేసారు. గత ఐదేళ్లలో ఆంధ్ర రాష్ట్ర రహదారుల శాఖ ఇక్కడ పని చేసిన దాఖలాలే కనబడడం లేదని దుయ్యబట్టారు.
కాగా, ఈ మీటింగులో జనసేనానితో కరచాలనం చేయడానికి, ఫోటోలు తీసుకోడానికి జనం ఎగబడ్డారు. అయితే అందరితో పవన్ ఎంతో ఓపికగా మాట్లాడి వారు చెప్పిన సాదకబాధలను వినడం జరిగింది. అందరినీ తప్పకుండా కలుస్తానని, కోరినవారికి ఖచ్చితంగా ఫోటోలు దిగే అవకాశం కల్పిస్తానని పవన్ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. కాగా కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: