మెదక్ : రేవంత్ ది.. ముమ్మాటికీ ఓ స్త్రీ రేపు రా పాలనే?

praveen
ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి రాజకీయం వేడెక్కింది. ఇక అన్ని పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ప్రత్యర్ధులను ఓడించేందుకు పావులను కదుపుతూ ఉన్నాయి. ఇక విమర్శలు ప్రతి విమర్శలు ఎప్పటిలాగానే కొనసాగుతూ ఉన్నాయి. కాగా  మెదక్ ఎంపీ అభ్యర్థి బరిలో ఏకంగా మూడు పార్టీలు ఎంతో పటిష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు బిజెపి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ను మెదక్ ఎంపీగా నిలబెట్టింది.

 కాగా రఘునందన్ రావు ఎంత మంచి వ్యాఖ్యాత అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మాటలతో ఓటర్లను ఇట్టే ఆకట్టుకోగలడు. ఇంకోవైపు బీఎస్పీని వదిలి కాంగ్రెస్లో చేరిన నీలం మధు ముదిరాజ్ కు బీసీ కోటాలో మెదక్ ఎంపీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇంకోవైపు వెంకట్రామిరెడ్డి బిఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం పటిష్టమైన అభ్యర్థులుగానే  ఉన్నారు అని చెప్పాలి. ఎవరికి వారు ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారూ. ఇకపోతే ఇటీవల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బిజెపి మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఏకంగా కాంగ్రెస్ పాలన గురించి తీవ్ర విమర్శలు చేశారు.

 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓ స్త్రీ రేపు రా అన్న విధంగా పాలను కొనసాగిస్తుంది అంటూ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. శివంపేట మండలం కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డిసెంబర్లో రుణమాఫీ చేస్తా అని రైతులకు హామీ ఇచ్చాడు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు మొండిచేయి చూపించారు అంటూ రఘునందన్ విమర్శించారు. ఇలా రుణమాఫీ చేయకుంటే రైతులు ఏం చేయాలి అంటూ ప్రశ్నించాడు. మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను అంటూ వ్యాఖ్యానించాడు రఘునందన్ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: