ఏపీ : లోకేష్ ప్రాణాలకు ముప్పు.. అప్రమత్తమైన కేంద్రం..!!

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మలుపు తీసుకుంటుంది.. ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ఎప్పటికప్పుడు పరిణామాలు అన్నీ మారిపోతున్నాయి..రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే ఎన్నడూ లేనంత ఉత్కంఠత తో ఈ సారి ఎన్నికలు సాగుతున్నాయి.. ఈ ఎన్నికలలో ఎన్నడూ చూడనంతగా హత్యా రాజకీయాలకు అధికార పార్టీ తెరలేపుతుందని ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ ఆరోపిస్తుంది. అలాగే టీడీపీ యువనేత, జాతీయ కార్యదర్శి అయిన నారా లోకేష్‌ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు తెలియజేస్తున్నాయి..దీనితో ఈ విషయం పై కేంద్రం అప్రమత్త మైంది.. లోకేష్ కు జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా తెలిపింది.. 

అయితే ప్రస్తుతం నారా లోకేష్‌కు చాలా పరిమితమైన సెక్యూరిటీ కల్పించడమే కాదు.. కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని రీసెంట్ గా రెండు రోజుల వ్యవధిలో ఆయన వాహనాలను నాలుగు సార్లు ఉద్దేశపూర్వకంగా చెక్ చేయడం జరిగింది.ఇదంతా ఓ కుట్ర పూరితంగా జరుగుతోందని టీడీపీ ఆరోపించింది..దీనితో నారా లోకేష్ ప్రాణాలకు ముప్పు ఉందని స్పష్టమైన సమాచారం రావడంతో జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వ వ్యవహారశైలి.. ప్రభుత్వ అధినేతల తీరు కూడా అత్యంత క్రూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది.రాజకీయంగా తమకు అడ్డు తగిలే వారిని శాశ్వతంగా నిర్మూలించాలన్న ఉద్దేశం వారిలో ఉంటుందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీనికి ఉదాహరణలుగా చాలా ఘటనలు గతంలో జరిగాయి..

 గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్ ను తగులబెట్టడం, టీడీపీ నేతలపై క్రూరంగా దాడి చేయడం, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎన్నో సార్లు రాళ్ల దాడులు జరిగడం వంటివి చాలా జరిగాయి..ఇలాంటి దాడుల్లో చనిపోయిన వారు కూడా చాలా మందే వున్నారు..దీనితో కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గం అలెర్ట్ అయింది.లోకేష్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీని మరింతగా పెంచారు. ఇప్పుడు ఆ క్రూరమైన ఆలోచనలు లోకేష్ మీదకు కూడా మళ్లించినట్లుగా ఇంటలిజెన్స్ వర్గాలు నమ్మడంతో సెక్యూరిటీని పెంచారు. గతంలో వివేకానంద హత్య  జరగడం ఆ కేసు లో ఉన్న నిందితుల్ని కాపాడటానికి చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి..ఈ క్రమంలో ప్రతి పక్ష నేతల భద్రతపై కేంద్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: