తిరుపతి: టీడీపీలో చీలికలు.. బాబు నిర్ణయం వైసీపీ కి వరం?

Divya
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలవేళ టిడిపి - జనసేన- బిజెపి కూటమితో ముందుకు సాగుతున్నాయి.. కొన్ని స్థానాలలో కూటమి చిచ్చులేపేలా కనిపిస్తోంది. మరి కొన్ని స్థానాలలో అభ్యర్థుల మార్పులు చేర్పుల వల్ల కూడా టిడిపిలో అసంతృప్తి మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే ఇండియా హెరాల్డ్ కు అందిన సమాచారం ప్రకారం.. టిడిపి ఫైనల్ లిస్టు నిన్నటి రోజున విడుదల చేశారు.. అయితే అందులో రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని సుఖవాసి సుబ్రహ్మణ్యం ను  అభ్యర్థిగా తెలియజేశారు టిడిపి అధిష్టానం.. ఇప్పుడు ఈ విషయమే అక్కడ నియోజకవర్గంలో టిడిపికి అసమ్మతి సెగగా మారిపోయింది..

ఇండియా హెరాల్డ్ కు అందిన సమాచారం మేరకు.. బత్యాల చెంగల్ రాయుడుకు టిడిపి టికెట్ ఆ స్థానంలో ఇవ్వకపోవడంతో ఆయన కార్యకర్తలు బగ్గుమంటున్నారు.. దీంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తున్నది.. నిన్నటి రోజున  రాత్రి కార్యకర్తలతో,  అనుచరులతో సమావేశమవగా.. వారు చంగల్రాయుడిని ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఒత్తిడి చేయడంతో  ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆదరిస్తారని చెంగల్రాయుడు ఇటీవల వెల్లడించారు.

ఇండియా హెరాల్డ్ తెలుపుతున్న కథనం ప్రకారం నాలుగేళ్లు పార్టీ క్యాడర్ కోసమే పనిచేసిన తనకు చంద్రబాబు నాయుడు ఇలాంటి బహుమానం ఇచ్చారనే ఆగ్రహంతో చంగల్రాయుడు మాట్లాడుతూ.. పార్టీ కోసం పని చేసే వారికి టిడిపిలో అసలు గుర్తింపు రాలేదంటూ ఆగ్రహాన్ని తెలిపారు.అందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలోకి దిగాలని అనుచరులు కూడా ఒత్తిడి తేవడంతో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు...

దీంతో ఇప్పుడు రాజంపేటలో టిడిపి లో అసమ్మతులు బయటపడినట్టుగా వైసిపి నాయకులు సైతం తెలియజేస్తున్నారు.. టిడిపికి కూడా చంగల్రాయుడు రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.. దీంతో చంగల్రాయుడు అభిమానులు సైతం బాబు నిర్ణయం వైసీపీకి వరంగా మారుతుంది అంటూ తెలుపుతున్నారు.. కచ్చితంగా టిడిపిని ఈసారి అసెంబ్లీ స్థానం నుంచి గెలవనివ్వమంటూ కూడా చూస్తామని వైసిపి నిర్ణయం తీసుకున్నాను వార్తలు వినిపిస్తున్నాయి.. చంద్రబాబు తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు వైసిపి పార్టీకి మరింత వరంగా మారనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: