కేటీఆర్ : కేకే.. కడియం ప్రవర్తనపై సీరియస్.. ఆ వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను..!

Pulgam Srinivas
తాజాగా తెలంగాణ భవ న్‌లో జరిగిన చేవెళ్ల పార్ల‌మెంట్ నియోజక వర్గ విస్తృత స్థాయి స‌మావేశంలో "బీ ఆర్ ఎస్" వర్కింగ్ ప్రెసిడెంట్ "కే టీ ఆర్" గారు పాల్గొన్నారు. అందులో భాగంగా అనేక విశాయలపై ఆయన స్పందించారు. తాజాగా కేటీఆర్ మాట్లాడుతూ...  కేకే , కడియం లాంటి సీనియర్ నాయకులు పార్టీ కష్ట కాలంలో వదిలి పెట్టి వెళ్తున్నారు .  పోయే వాళ్లు పోకుండా పార్టీ పై కొన్ని రాళ్లు వేసి వెళ్తారు. వాళ్ళు చేస్తున్న విమర్శలపైన వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది.

ఈ రోజు నాయకులు మన పార్టీని వదిలేసినా… పార్టీ శ్రేణుల కోసం నేను స్వయంగా పని చేస్తా. ఇన్ని రోజులు పార్టీ కోసం , నాయకుల కోసం పని చేసిన కార్యకర్తల కోసం నేను స్వయంగా వస్తాను. రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో మన పార్టీ సభ్యులందరినీ నేను గెలిపించుకుంటా అని కేటీఆర్ హామీ ఇచ్చాడు. రంజిత్ రెడ్డి కూడా పార్టీ కి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారు.

2014 లో విశ్వేశ్వర్ రెడ్డి ని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎంపీ గా చేసినం. 2019 లో రంజిత్ రెడ్డి మాదిరి పార్టీని వదిలి కాంగ్రెస్‌ లో చేరితే చేవెళ్ల ప్రజల చైతన్యం తో ఆయన అక్కడ ఓడిపోయారు. కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అయిన రోజు నవ్వుకుంటూ కాంగ్రెస్ లోకి పోయిన రంజిత్ రెడ్డి , పట్నం మహేందర్ రెడ్డి ల పైన మన పార్టీ కార్యకర్తలు పగ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.

ఇదే మహేందర్ రెడ్డి , రంజిత్ రెడ్డిలు మళ్ళీ వచ్చి కేసీఆర్ గారి కాళ్లు పట్టుకున్న పార్టీలోకి రానీయం అని కేటీఆర్ తాజా ప్రసంగంలో చెప్పుకొచ్చాడు. ఇక కేటీఆర్ ప్రస్తుతం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల గెలుపు గురించి చాలా సేపు చర్చించినట్లు తెలుస్తోంది. ఇకపోతే కేటీఆర్ ఇకపై వచ్చే లోక్ సభ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవేందుకు తన శక్తికి మించి ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: