పవన్ ని వదలనంటున్న మాజీ హోమ్ మంత్రి?

Purushottham Vinay
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ 70 అసెంబ్లీ సీట్లలో లేదా కనీసం 60 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయాలని, అధికారంలో వాటా (పవర్‌ షేరింగ్‌), రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని తీసుకోవాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు ఇంకా మాజీ హోం మంత్రి హరిరామజోగయ్య..జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు పలుమార్లు లేఖలు రాసిన సంగతి తెలిసిందే.అయితే పవన్‌ కళ్యాణ్ 24 అసెంబ్లీ సీట్లకు, 3 పార్లమెంటు సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. ఆ తర్వాత కూటమిలో బీజేపీ కూడా చేరడంతో 21 అసెంబ్లీ ఇంకా 2 పార్లమెంటు సీట్లలోనే జనసేన పోటీ చేస్తుందని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు.పవన్‌ కళ్యాణ్ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీలోనూ, ఆ పార్టీని అభిమానించే వారిలోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి. పవన్‌ కళ్యాణ్ తీసుకున్న సీట్లపైన అంతా పెదవి విరిచారు. చంద్రబాబు నాయుడు పవన్‌ ను మోసం చేశాడని ధ్వజమెత్తారు. అయితే పవన్‌ కళ్యాణ్ వీరందరికీ కూడా కౌంటర్‌ ఇచ్చారు.


తనకు సలహాలు ఇచ్చేవారు వద్దని..కేవలం తాను చెప్పింది విని తన బాటలో నడిచేవాళ్లే తనకు కావాలంటూ పవన్ తేల్చిచెప్పారు. ఇంకా అంతేకాకుండా ఎక్కడో విదేశాల్లో, ఇంట్లో కూర్చుని సలహాలు, సూచనలు ఇవ్వడం తేలికని అన్నారు. దీంతో హరిరామజోగయ్య కూడా పవన్‌ కళ్యాణ్ వైఖరితో తాను ఇక ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వబోనని ప్రకటించారు. మరోవైపు జోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్‌ వైసీపీలో చేరడం జరిగింది.దీనిపైనా పవన్‌ కళ్యాణ్ పరోక్షంగా సెటైర్లు వేశారు. తనతో ఉంటామన్నవారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చూడాలని జనసేన నేతలు ఇంకా కార్యకర్తలకు చెప్పారు. అయితే ఇండియా హెరాల్డ్ కి తెలిసిన సమాచారం ప్రకారం తాను మాత్రం జనసేన పార్టీలోనే ఉంటానని, ఆ పార్టీ మేలు కోసం, పవన్‌ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే దాకా అండగా ఉంటానని హరిరామ జోగయ్య తెలిపారు.వైసీపీని ఓడించడమే ధ్యేయంగా పనిచేయాలని జోగయ్య పిలుపునిచ్చారు.మొత్తం 25 మంది సభ్యులతో కాపు బలిజ సంక్షేమ సేన నూతన కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: