ప‌ల్నాడు: కంచుకోట‌లో టీడీపీకిలోకి భారీ వ‌ల‌స‌లు... వైసీపీ మూడు సున్నాలు చుట్టేస్తోందా..!

RAMAKRISHNA S.S.
ప‌ల్నాడు జిల్లాలోని న‌ర‌సారావుపేట పార్ల‌మెంటు ప‌రిధిలో వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే వినుకొండ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోనూ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ ఎత్తున వ‌ల‌స‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే వినుకొండ టీడీపీ అభ్య‌ర్థి, ప‌ల్నాడు జిల్లా తెలుగుదేశం అధ్య‌క్షులు మాట్లాడుతూ వినుకొండ సహా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి కొనసాగుతున్న వలసలే ఆ పార్టీ పతనానికి నాంది అని ఆయ‌న జోస్యం చెప్పారు.

ఎన్నిక‌ల‌కు 45 రోజుల ముందే వైసీపీకి ఈ ప‌రిస్థితి ఉంటే ఎన్నికల నాటికి వైసీపీ మరింత డీలా పడటం ఖాయమని, వినుకొండ వైసీపీలో చివరికి బొల్లా బ్రహ్మనాయుడు ఒక్కరే మిగులుతారేమోనని ఎద్దేవా చేశారు. బొల్లా అవినీతి, అక్రమాలు భరించలేకే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తెలుగుదేశంలో చేరుతున్నారని అని జీవీ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ వినుకొండ తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. కూటమి ఉమ్మడి అభ్యర్థి జీవీ ఆంజనేయులు చేపడుతున్న ప్రతి కార్యక్రమంలోనూ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఒక రేంజ్‌లో వ‌ల‌స‌లు కంటిన్యూ అవుతున్నాయి.

మ‌రీ ముఖ్యంగా టీడీపీ కాస్తో కూస్తో వీక్‌గా ఉండే బొల్లాపల్లి మండలంలో పలు గ్రామాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. గండిగనుములలో ఏకంగా 200 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. గండిగనుములలో జరిగిన కార్యక్రమంలో వీరంతా జీవీ ఆంజనేయులు, ఎంపీ లావు, మాజీ ఎమ్మెల్యే మక్కెన సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే గుట్లపల్లికి చెందిన 10 వైసీపీ కుటుంబాలు జీవీ సమక్షంలో తెలుగుదేశంలో పార్టీలో చేరాయి. ఏదేమైనా టీడీపీ కి కంచుకోట లాంటి వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి రోజు వైసీపీ నుంచి బారీ ఎత్తున టీడీపీలోకి చేరిక‌లు ఉంటున్నాయి. ఈ జోష్ చూస్తుంటే వైసీపీ ఇక్క‌డ 30 ప‌క్క‌న మూడు సున్నాల‌తో 30,000 వేల మెజార్టీతో ఓడిపోయే ప‌రిస్థితి ఉంద‌న్న చ‌ర్చ‌లే న‌డుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: