నెల్లూరు : టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం..!!

murali krishna
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం వేడెక్కింది.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, ప్రతి పక్ష పార్టీలు ప్రచార హోరు మొదలు పెట్టాయి. విమర్శ, ప్రతి విమర్శలతో ఇరు పార్టీలు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.ఇరు పార్టీ అధినేతలతో పాటుగా టిక్కెట్లు పొందిన ఎంపీ మరియు అసెంబ్లీ అభ్యర్థులు తమ నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టారు.. పలు రకాల హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వైసీపీ పార్టీ ముఖ్యనేతగా మరియు రాజ్యసభ ఎంపీ గా వున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా  చేశారు.వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు లేఖను పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌కు పంపారు. దీన్ని తక్షణమే ఆమోదించాలని కోరారు.రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నట్లు వేమిరెడ్డి పేర్కొన్నారు.ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి కూడా వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.  

వేమిరెడ్డితో ఎలాంటి సంప్రదింపులు జరప కుండా జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు జరిగాయి. కొత్త వారిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించారు. దీంతో మనస్థాపానికి గురైన వేమిరెడ్డి తీవ్ర అసంతృప్తి చెందారు. తనకు కనీస ప్రాధాన్యత లేని చోట ఎందుకని ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లి పోయారు.దీనితో prabhakar REDDY' target='_blank' title='వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు మార్చి నెలారంభంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు.. పార్టీలో చేరగానే వారిద్దరికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు కల్పించారు.వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చిన టీడీపీ.. ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డికి కోవూరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది.ఇదిలా ఉంటే నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నిండు సభలో చేదు అనుభవం ఎదురైంది. సైకిల్ గుర్తుకి ఓటు వేయమని అడగ్గానే జనం అక్కడి నుంచి వెళ్లిపోయారు.దీనికి సంబందించిన వీడియో బాగా వైరల్ అవుతుంది.వేమిరెడ్డి ఎక్కడికి వెళ్లిపోతున్నారు ఉండండి అనడం వీడియోలో కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: